కొట్టేశాడు డ‌బుల్ హ్యాట్రిక్

కొట్టేశాడు డ‌బుల్ హ్యాట్రిక్

‘తొలి ప్రేమ’ లాంటి క్లాసిక్ తీసిన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్.. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూప‌ర్ హిట్లు కొట్టిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు కలిసినా.. మెగాస్టార్ చిరంజీవి ర‌షెస్ చూసి మార్పులు చేర్పులు చేయించినా.. సాయిద‌ర‌మ్ తేజ్ రాత మార‌లేదు. అత‌డి ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ప‌డింది. తేజ్ కొత్త సినిమా ‘తేజ్ ఐ ల‌వ్యూ’ కూడా డిజాస్ట‌రే అని తేలిపోయింది. తొలి రోజు నెగెటివ్ టాక్ తో మొద‌లై పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఆ త‌ర్వాత కూడా పుంజుకోలేదు. నామ‌మాత్ర‌పు వ‌సూళ్లతో న‌డుస్తున్న ఈ చిత్రం తొలి వీకెండ్లో రూ.3.45 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు రూ.3.05 కోట్లు మాత్ర‌మే షేర్ వ‌చ్చింది.

దాదాపుగా తేజ్ గ‌త సినిమా ‘ఇంటిలిజెంట్’ రేంజ్ లోనే ఈ సినిమా నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ చిత్రం రూ.4 కోట్ల లోపే షేర్ సాధించింది. వీకెండ్ లోపే అంతంత‌మాత్రంగా న‌డిచిన‘తేజ్ ఐ ల‌వ్యూ’ ఆ త‌ర్వాత అయినా పుంజుకుంటుందన్న ఆశ‌లేమీ క‌నిపించ‌డం లేదు. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి క‌థ‌తో ఏ మాత్రం ఫీల్ లేని ల‌వ్ స్టోరీ అందించాడు కరుణాక‌ర‌న్. ఈ ట్రెండుకు ఏమాత్రం త‌గ‌ని ల‌వ్ స్టోరీ ఇది. మాస్ క‌థ‌ల‌తో విసుగెత్తించేసి.. ఈసారి భిన్నంగా ఉంటుంద‌ని ల‌వ్ స్టోరీ ట్రై చేస్తే అది కూడా తేజ్ కు నిరాశ‌నే మిగిల్చింది. తిక్క‌.. విన్న‌ర్.. న‌క్ష‌త్రం.. జ‌వాన్.. ఇంటిలిజెంట్.. ఇలా ఇప్ప‌టికే ఐదు డిజాస్ట‌ర్లు తిన్న తేజ్..‘తేజ్ ఐ ల‌వ్యూ’ తో డ‌బుల్ హ్యాట్రిక్ పూర్తి చేసేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English