వీళ్లిద్దరికీ ఎలా సెట్టవుతుందబ్బా..

వీళ్లిద్దరికీ ఎలా సెట్టవుతుందబ్బా..

డైరెక్టర్ తేజది ఒక ప్రత్యేకమైన స్కూలు. ఆయన సినిమాలన్నీ ఒక తరహాలో ఉంటాయి. వాటిలో హీరోయిజం ఉండదు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్.. ఐటెం పాట.. డ్యూయెట్లు.. డ్యాన్సింగ్ సాంగ్స్.. హీరోయిజం ఎలివేషన్ సీన్లు.. ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లడు తేజ. హిట్ తీసినా.. ఫ్లాప్ తీసినా.. కథతో పాటు సాగిపోవడమే ఆయన శైలి. కమర్షియల్ హంగుల కోసం రాజీ పడడు.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా ఆయన స్టైల్ మార్చుకోలేదు. తన దారిలోనే తాను సాగిపోయాడు. అలాంటి దర్శకుడితో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమై.. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా మొదలైంది.

ఐతే కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు చూస్తున్న వారికి అతడి శైలేంటో బాగా అర్థమైంది. కథ ఎలాంటిదైనా.. దర్శకుడు ఎవరైనా.. శ్రీనివాస్‌ను హీరోగా ఎలివేట్ చేసే అంశాలు సినిమాలో ఉండాల్సిందే. హీరోయిజం ఉండాలి.. ఫైట్లకు ఢోకా ఉండకూడదు.. అలాగే డ్యాన్సులు అదిరిపోవాలి. కమర్షియల్ హంగులన్నీ జోడించాలి. ఇలా అతడి ఇమేజ్ పెంచడానికే ఏ దర్శకుడైనా ప్రయత్నించాలి. ఇందుకోసం శ్రీనివాస్ తండ్రి సురేష్ వెనుక ఉండి సహాయ సహకారాలు అందిస్తాడు.

సినిమాలకు ఫినాన్షియల్ బ్యాకప్ ఇవ్వడంతో పాటు రిలీజ్‌కు కూడా సహకరిస్తాడు. ఈ తరహా ఒప్పందాల మీదే అతడితో దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ఐతే తేజ ఇలాంటి వాటికి ఒప్పుకునే రకం కాదు. అతడిదంతా వేరే స్టైల్. ఎంత పెద్ద హీరో అయినా అతను మాట వినడు. తనకు నచ్చినట్లే సినిమా తీస్తాడు. రాజీ పడడు. మరి తన కొత్త సినిమాలో తేజ.. శ్రీనివాస్‌ను ఎలా చూపిస్తాడో.. వీళ్లిద్దరికి ఎలా సెట్టవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English