వావ్.. రెండో ఆదివారం 28 కోట్లు

వావ్.. రెండో ఆదివారం 28 కోట్లు

సంజయ్ దత్ కథను అతడికి అనుకూలంగా.. వాస్తవాల్ని వక్రీకరించిన చూపించారన్న విమర్శల సంగతెలా ఉన్నా.. ‘సంజు’ సినిమా బాక్సాఫీస్ జోరు మాత్రం ఇంకా తగ్గలేదు. రెండో వారాంతంలో కూడా ఒక కొత్త సినిమా తరహాలో వసూళ్ల వర్షం కురిపించిందీ చిత్రం. మూడు రోజుల సెకండ్ వీకెండ్లో ఈ చిత్రం రూ.63 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం.

శుక్రవారం రూ.13 కోట్లు.. శనివారం రూ.22 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఆదివారం ఏకంగా రూ.28 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ సినిమా ‘రేస్-3’ తొలి రోజు వసూలు చేసిన మొత్తానికి.. సంజు పదో రోజు వసూళ్లు దాదాపు సమానం కావడం విశేషం. దీన్ని బట్టే ‘సంజు’ ప్రభంజనం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

తొలి వారాంతంలోనే రూ.120 కోట్లు.. తొలి వారంలో రూ.200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. మొత్తంగా ఇప్పటికి రూ.265.5 కోట్లు రాబట్టింది. ఇవి ఇండియా వసూళ్లు మాత్రమే. ‘సంజు’ ఇండియా హైయెస్ట్ గ్రాసర్స్ టాప్-10 జాబితాలో కూడా చోటు సంపాదించింది. ప్రస్తుతం ఈ చిత్రం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. రూ.300 కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే కావచ్చు. ఇంతకముందు రాజ్ కుమార్ హిరాని సినిమాలు ‘3 ఇడియట్స్’.. ‘పీకే’ ఇండియాలో రూ.300 కోట్ల మార్కును దాటాయి. ఇది కూడా వాటి సరసన చేరబోతోంది. ఐతే ఆ రెండు సినిమాల్లో అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ నటించాడు.

కానీ ‘సంజు’లో అంతగా ఇమేజ్ లేని.. ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించాడు. హీరో ఎవరైనా తనకు తిరుగులేదని రాజ్ కుమార్ మరోసారి చాటిచెప్పాడు. కాకపోతే హిరాని గత సినిమాల్లా ‘సంజు’ ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన గౌరవాన్ని చాలావరకు తగ్గించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English