చైతూ అదే డ్రెస్సులో వచ్చాడే..

చైతూ అదే డ్రెస్సులో వచ్చాడే..

ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. ఒకటికి రెండు ఫస్ట్ లుక్స్ లాంచ్ చేశాడు దర్శకుడు మారుతి. ఒక పోస్టర్లో చైతూ ఒక్కడే ఉంటే.. మరో పోస్టర్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్.. ఈ చిత్రంలో చైతూ అత్తగా కీలక పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ కూడా ఉంది.

ముగ్గురూ ఉన్న లుక్ సంగతలా వదిలేస్తే.. చైతూ సింగిల్ లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే వారం కిందట ఫేక్ లుక్ అని చిత్ర బృందం కొట్టి పారేసిన లుక్‌లో చైతూ ఇదే డ్రెస్‌తో కనిపించాడు. బహుశా చిత్ర బృందం ఓకే చేసిన లుక్‌నే అప్పుడు ఎవరో లీక్ చేసేసి ఉండొచ్చు. మరి దాన్ని ఫేక్ లుక్ అని కొట్టిపారేసిన మారుతి బృందం.. ఫస్ట్ లుక్‌గా అదే డ్రెస్‌తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేయాల్సింది కాదు.

ఇక రెండో లుక్ సంగతి చూస్తే అందులో చైతూ, అను, రమ్యల లుక్స్ బాగున్నాయి. ఆ పోస్టర్లో ఒక గ్రాండియర్ కనిపిస్తోంది. ఐతే ఈ టైటిల్.. ఈ లుక్ చూస్తే కథ రొటీన్‌గా ఉండొచ్చన్న ఫీలింగ్ కలుగుతోంది. పొగరుబోతు అత్త.. ఆమెకు సవాలు విసిరే అల్లుడు.. ఈ తరహాలో ‘అల్లరి అల్లుడు’ టైపు సినిమా ఏమో ఇది అనిపిస్తోంది. మరి మారుతి ఏ రకమైన కొత్తదనం చూపిస్తాడో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు చైతూతో ఇదే సంస్థ ‘ప్రేమమ్’ తీసింది. అది హిట్టయింది కానీ.. మారుతితో ఈ సంస్థ నిర్మించిన ‘బాబు బంగారం’ ఫ్లాప్ అయింది. గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు