మోహన్ లాల్ కొడుకు.. రాజశేఖర్ కూతురు

మోహన్ లాల్ కొడుకు.. రాజశేఖర్ కూతురు

మంచు లక్ష్మి.. కొణిదెల నిహారికల బాటలోనే సినీ కుటుంబం నుంచి మరో కథానాయిక త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. సీనియర్ హీరో రాజశేఖర్ తనయురాలైన శివాని ఇప్పటికే తెలుగులో అడివి శేష్ సరసన ‘2 స్టేట్స్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఆమెకు మరిన్ని అవకాశాలు అందుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

అది కూడా వేరే భాషల్లో కావడం విశేషం. తమిళంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రానికి శివానిని కథానాయికగా ఎంచుకున్నట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. మరోవైపు శివాని ఇంకో కొత్త భాషలోకి కూడా వెళ్తున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం.

ఆమె త్వరలోనే మలయాళంలో నటించబోతోందట. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించే కొత్త సినిమాలో శివానిని కథానాయికగా తీసుకున్నారట. చిన్నతనంలోనే నటుడిగా పరిచయమై.. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా దర్శకత్వ విభాగంలోకి వెళ్లిపోయిన ప్రణవ్.. మళ్లీ ఈ మధ్యే నటన వైపు అడుగులేశాడు. ఓ యువ దర్శకుడితో అతను చేయబోయే సినిమాలో శివాని హీరోయిన్‌గా చేయబోతోందట. ఇలా తొలి సినిమా విడుదల కాకముందే శివాని త్రిభాషా కథానాయిక కాబోతోందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

కొన్నేళ్ల ముందు నుంచే నటనతో పాటు ఇతర విషయాల్లోనూ శిక్షణ తీసుకున్న శివాని.. తనకొచ్చిన అవకాశాల్లోంచి జాగ్రత్తగా ‘2 స్టేట్స్’ను అరంగేట్ర చిత్రంగా ఎంచుకుంది. లుక్స్ పరంగా యావరేజ్ అనిపిస్తున్న శివాని నటిగా ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English