ప్రకాష్ రాజ్‌తో గొడవ.. అనుపమ జవాబిది

ప్రకాష్ రాజ్‌తో గొడవ.. అనుపమ జవాబిది

మలయాళ ‘ప్రేమమ్’తో కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది అనుపమ పరమేశ్వరన్. అందం, అభినయంతో తనదైన ముద్ర వేసిన అనుపమ గురించి ఆమెతో పని చేసిన వాళ్లందరూ చాలా పాజిటివ్‌గా మాట్లాడతారు. అలాంటమ్మాయి గురించి తాజాగా ఒక రూమర్ బయటికి వచ్చింది. రామ్ సరసన తాను నటిస్తున్న కొత్త సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’ షూటింగ్ సందర్భంగా అనుపమకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో గొడవైందని.. ఒక సన్నివేశంలో అనుపమ సరిగా చేయనందుకు ప్రకాష్ రాజ్ అసహనం చెందుతూ కరెక్షన్ చెప్పారని.. అందుకామె హర్టయిందని.. ఏడ్చిందని ఒక రూమర్ హల్ చల్ చేసింది. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో దీని గురించి డిస్కషన్ నడుస్తోంది.

సినీ పరిశ్రమలో ఇలాంటి రూమర్లు మామూలే కాబట్టి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటిపై ఏమీ స్పందించరు. కానీ అనుపమ అలా ఊరుకోలేదు. దీనిపై క్లారిఫై చేయాలనుకుంది. ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్‌తో కలిసి ఆమె ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఇద్దరూ సరదాగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు తోడుగా ‘దోస్ జోక్స్’ అని క్యాప్షన్ పెట్టి స్మైల్ ఇమోజీలు జత చేసింది. విషయం వివరంగా చెప్పకపోయినప్పటికీ.. తనకు, ప్రకాష్ రాజ్‌కూ ఏ గొడవా లేదని.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారమంతా శుద్ధ అబద్ధమని చెప్పకనే చెప్పింది అనుపమ. తన గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చక్కగా ఖండించింది అనుపమ. ఇలాంటివి పట్టించుకోకుండా వదిలేయొచ్చు కానీ.. అభిమానులకు ఎందుకు కన్ఫ్యూజన్ అనుకుందేమో.. అందుకే ఇలా క్లారిటీ ఇచ్చేసింది. అనుపమ కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ రెండు రోజుల కిందటే రిలీజైంది. ఆ సినిమాకు ఆశించిన టాక్ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English