‘సంజు’తో అతడికెంత ముట్టింది?

‘సంజు’తో అతడికెంత ముట్టింది?

ఇండియన్ బాక్సాఫీస్ చాన్నాళ్ల తర్వాత వేడెక్కింది ‘సంజు’ సినిమాతో. ఈ చిత్రం తొలి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లు వస్తున్నాయీ చిత్రానికి. ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. సెకండ్ వీకెండ్లో కూడా ‘సంజు’ జోరు కొనసాగుతోంది. ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కును ఈజీగా దాటేసేలా ఉందీ చిత్రం. ఈ చిత్ర దర్శక నిర్మాత రాజ్ కుమార్ హిరాని భారీ లాభాలు అందుకుంటున్నాడీ చిత్రంతో. ఈ సినిమా సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. మరి తన సినిమా తీయడానికి సంజు ఊరికే ఒప్పుకుంటాడా? అందుకు డబ్బులు ఏమీ తీసుకుని ఉండడా? అన్న సందేహాలు కలగడం సహజం.

హిరానికి ఎంత ఆప్త మిత్రుడైనప్పటికీ తన కథను సినిమా తీయడానికి ఊరికే ఏమీ ఒప్పుకోలేదట. ఇందుకోసం సంజుకి ఏకంగా రూ.10 కోట్లు సమర్పించుకున్నాడట. ఐతే అంతటితో కథ ముగిసిపోలేదు. ఈ చిత్రానికి వచ్చే లాభాల్లోనూ సంజుకి వాటా ఉందట. ఆ రూపంలో ఇంకెంత ముడుతుందో చూడాలి. నిజానికి ఈ సినిమా తీసినందుకు హిరానికి సంజునే ఎంతో రుణ పడి ఉండాలి. సంజయ్ అసలు కథను చాలా వరకు వక్రీకరించి.. సంజు జీవితంలో జరిగిన చెడు ఘటనలన్నింటిలోనూ అతడి ప్రమేయం ఏదీ లేదన్నట్లుగా కవర్ చేసి.. అతడిని ఒక ఉత్తముడిలాగా ప్రొజెక్ట్ చేసినందుకు హిరానికి సంజూనే రివర్సులో డబ్బులివ్వాలని.. తన మిత్రుడి కోసం హిరాని చాలా గొప్ప సాయమే చేశాడని సోషల్ మీడియాలో జనాలు కౌంటర్లు వేస్తున్న పరిస్థితి. ఈ సినిమా ఎంత బాగున్నా.. కమర్షియల్‌గా ఎంత పెద్ద సక్సెస్ అయినా.. ‘సంజు’ హిరాని ఇమేజ్‌ను చాలా డ్యామేజ్ చేసిందనడంలో మాత్రం సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు