సినిమా ఆడకపోతే గేదెలు కాసుకుంటా

 సినిమా ఆడకపోతే గేదెలు కాసుకుంటా

ఆర్ఎక్స్‌ 100.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన చిన్న సినిమా. ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో ఒక క్యూరియాసిటీ తీసుకు రాగలిగిందీ చిత్రం. ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో పాటు కొత్తగా లాంచ్ చేసిన మరో ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ నెల 12నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తన సినిమా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రొటీన్ సినిమాలు ఇష్టపడే.. ఆ తరహా సినిమాలు మాత్రమే చూసేవాళ్లు ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు రావొద్దని అతను స్పష్టం చేశాడు. తెలుగులో కొత్త తరహా సినిమాలు రావట్లేదని చాలామంది అనడం విన్నానని.. చాలాసార్లు రివ్యూల్లో కూడా చదివానని.. తాను కూడా స్వతహాగా కొత్త తరహా సినిమాలే ఇష్టపడతానని.. ఇప్పుడు తాను తీసింది కూడా కొత్త సినిమానే అని చెప్పాడు అజయ్ భూపతి. ఒక కొత్త కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశానని.. విభిన్నమైన సినిమాలు నచ్చే వాళ్లు కచ్చితంగా ఈ సినిమాకు రావచ్చని.. అలాంటి వాళ్లకు ‘ఆర్ఎక్స్ 100’ మంచి అనుభూతిని పంచుతుందని చెప్పాడు అజయ్.

ఈ సినిమా ఆడుతుందో.. ఆడదో తనకు తెలియదని.. కానీ కొత్తగా ట్రై చేశానని.. ఒకవేళ సినిమా ఆడకపోతే తన ఊరికి వెళ్లి గేదెలు కాచుకుందామని ముందే ఫిక్సయిపోయానని అజయ్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్‌కి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అతడి తండ్రి అశోక్ రెడ్డి నిర్మించాడు. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించింది. రావు రమేష్, రాంకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు