ఇద్దరి ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

ఇద్దరి ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

చూస్తూ ఉంటే ప్రియాంక ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్టే ఉంది. ఈమధ్య హాలీవుడ్ లో ఆఫర్ రావడంతో బాలీవుడ్ సినిమాలు తగ్గించేసి అమెరికాలోనే ఎక్కువ రోజులుంది. ఈ టైంలోనే ఆమెకు అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రణయంగా మారింది. అమెరికాలో చాలా రోజుల పాటు  చెట్టపట్టాలేసుకుని కలిసి తిరిగిన వీరంతా ఈమధ్యనే ఇండియాకు జంటగా వచ్చారు.

వీళ్లిద్దరి ఇండియా పర్యటన వెనుక ఉన్న రీజన్ పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడమే అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ మధ్యనే స్పెషల్ గా ప్లాన్ చేసిన డిన్నర్ లో తన బాయ్ ఫ్రెండ్ నిక్ ను అమ్మ మధు చోప్రాకు పరిచయం చేసింది ప్రియాంక చోప్రా. ఆ తరవాత వీళ్లిద్దరూ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లిపోయారు. ఈ టైంలో అభిమానులు ప్రియాంకను.. ఆమె ఫొటోలను చాలా నిశితంగా చూస్తూనే ఉన్నారు.

అందులో చాలామంది నోటీస్ చేసిందేమిటంటే వీళ్లిద్దరి చేతులకు ఒకే రకమైన రింగ్ లు కనిపించాయి. అంటే ఇప్పటికే వీళ్లిద్దరూ రింగులు మార్చేసుకున్నారని.. ఎంగేజ్ మెంట్ అయి ఉంటుందని  గుసగుసలు వినిపించాయి. కానీ వీళ్లిద్దరి రింగులు ఇంకా కుడి చేతికే ఉన్నాయని.. కాబట్టి ఎంగేజ్మెంట్ అయి ఉండదని కొందరు అంటున్నారు. అవి వాళ్ల ప్రేమకు గురుతుగా పెట్టుకున్నారని ప్రియాంక సన్నిహితులు చెబుతున్నారు. పెళ్లి విషయంలో ఇద్దరూ చాలా సీరియస్ గానే ఉన్నారనేది వాళ్లు చెబుతున్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English