ఆమె కోసం అక్కినేని ఫ్యామిలీ

ఆమె కోసం అక్కినేని ఫ్యామిలీ

క్షణం సినిమాతో హీరోగా మారాడు అడవి శేష్. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే మరోవైపు హీరోగా గూఢచారి సినిమా మొదలెట్టాడు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. అనుకోని కారణాల వల్ల సినిమా డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలాంటి టైంలో అనుకోని అదృష్టంలా ఈ సినిమాకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ లభించడంతో అడవి శేష్ తెగ ఆనందపడిపోతున్నాడు.

ఈ సినిమాపై అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఇంట్రస్ట్ కు కారణం సుప్రియ. హీరో నాగార్జున మేనకోడలు అయిన ఈమె ఇరవై ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ గా నటించింది. ఆ తరవాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. మేనమామ నాగార్జునతో కలిసి సినిమా ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయింది. ఈమె మళ్లీ ఇన్నాళ్లకు గూఢచారి సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ఆమెను పట్టుబట్టి ఒప్పించాడు అడవి శేష్.

సుప్రియపై ఉన్న అభిమానంతో అక్కినేని ఫ్యామిలీ గూఢచారి సినిమాను ప్రమోట్ చేస్తోంది. సినిమా ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని కోడలు.. హీరోయిన్ సమంత హాజరై ట్రయిలర్ ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అఖిల్ - నాగార్జున గూఢచారి సినిమా ట్రయిలర్ ను మెచ్చుకుంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. అలాగే సుమంత్ కూడా తన చెల్లి కోసం ఒక ట్వీటాశాడు. తన సిస్టర్ లో ప్రొఫైల్ మెయిన్టయిన్ చేయడానికి ఇష్టపడుతుందని.. అందుకే ఇన్నాళ్ళు విషయం బయటకు చెప్పలేదని సెలవిచ్చాడు. చూస్తుంటే సినిమా రిలీజయ్యే వరకు వీలైనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి అక్కినేని ఫ్యామిలీ సాయం చేస్తుందన్నమాట. మొత్తానికి సుప్రియను ఒప్పించడం అడవి శేష్ కు అలా కలిసొచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు