చిరు అండ్ కొరటాల.. ఎవరిది ఎవరు?

చిరు అండ్ కొరటాల.. ఎవరిది ఎవరు?

తీసింది నాలుగు సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. తన ప్రతి సినిమాలోనూ అండర్ కరెంట్ గా ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుని దాని చుట్టూ ఇంట్రస్టింగ్ కథను అల్లడం కొరటాల శివ స్పెషాలిటీ. శ్రీమంతుడులో సొంత ఊరికి మంచి చేద్దామని.. జనతా గ్యారేజ్ లో పర్యావరణాన్ని ప్రేమిద్దామని.. భరత్ అనే నేనులో మాటమీద నిలబడి ఉండాలని.. ఇలా అతడి సినిమాల్లో గ్యారంటీగా సొసైటీకి ఓ మెసేజ్ ఉంటుంది.

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తరవాత సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు ఠాగూర్.. స్టాలిన్ లాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశాడు. ఆ తరవాత మళ్లీ అలాంటి సినిమాలు తీయలేదు. సినిమాల్లోకి తిరిగి వచ్చాక చేసిన ఖైదీ నెంబర్ 150 కూడా ఫక్తు మాస్ మసాలా మూవీ. అందులో రైతుల బాధల గురించి చెప్పినా అది చివరిలో కొద్దిసేపే. సినిమా అంతా మెగాస్టార్ హీరోయిజం మీదే ఎక్కువ ఫోకస్ అవుతుంది.

ఇప్పుడు కొరటాల శివ  తీయబోయే సినిమాను తన పాత స్టయిల్లో అండర్ కరెంట్ గా ఉండే  మెసేజ్ తో ఉండేలా చూసుకుంటాడా.. లేకపోతే ఫ్యాన్స్ ను మెప్పించేలా పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తాడా అన్నది అభిమానులకు వస్తున్న డౌట్. రాజకీయాలను వదిలి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిన చిరు అభిమానులకు నచ్చే సినిమాలు చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కొరటాల స్టయిల్ ను చిరు ఫాలో అవుతాడా.. చిరు ఛాయిస్ ను కొరటాల ఓకే చేస్తాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు