ఫాన్స్‌ని అడ్డుపెట్టి పవన్‌పై పగ తీర్చుకుంటోందా?

ఫాన్స్‌ని అడ్డుపెట్టి పవన్‌పై పగ తీర్చుకుంటోందా?

పవన్‌కళ్యాణ్‌తో తనకి విడాకులు ఎందుకయ్యాయనే సంగతిని ఇన్నేళ్ల పాటు బయటపెట్టని రేణు దేశాయ్‌ ఇప్పుడు గుట్టు రట్టు చేసింది. తనతో విడాకులు కాకముందే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని పాపని కూడా కన్నాడని, తనకి విడాకుల ఆప్షన్‌ కూడా అతనే ఇచ్చాడని రేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

అంతే కాకుండా సోషల్‌ రెస్పాన్సిబులిటీ బాగా వున్న పవన్‌కి పర్సనల్‌ లైఫ్‌ సరిగా చూసుకోవడం రాదని, పిల్లల కోసం తగిన సమయం కేటాయించడని ఆరోపించింది. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అనేది సగటు పవన్‌ అభిమాని ప్రశ్న. ఫాన్స్‌ తనని ట్రోల్‌ చేస్తున్నారని, మళ్లీ పెళ్లి చేసుకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే నోరు విప్పాల్సి వచ్చిందని రేణు చెబుతోంది. అయితే ట్రోల్స్‌ని సీరియస్‌గా తీసుకుని ఎవరైనా వ్యక్తిగత జీవితాన్ని బజార్న పెట్టుకుంటారా?

నిజంగా అభిమానుల నుంచి త్రెట్‌ వుందని భావిస్తే వారిని మరింత నొప్పించి, రెచ్చగొట్టే విషయాలని మాట్లాడతారా? తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే అలవాటు పవన్‌కి లేదనేది రేణుకి తెలుసు. ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా, తన వెర్షన్‌ అతనెప్పుడూ బయటకి చెప్పడు. మరి అలాంటప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతూ ఇప్పుడు మాజీ భర్త ఇమేజ్‌కి నష్టం వాటిల్లే మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్టు? సినిమాలు వదిలేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన పవన్‌కి ఇప్పుడు ఇలాంటి ప్రచారం చాలా చేటు చేస్తుందనేది రేణుకి తెలియదా?

ప్రతి సెలబ్రిటీకి హేటర్స్‌, ట్రోలర్స్‌ వుంటారు. ఏ హీరో హ్యాండిల్‌ సెర్చ్‌ చేసినా పచ్చిబూతులు తిడుతూ పోయే వాళ్లు చాలా మందే తారసపడతారు. అయినా ఆ హీరోలు తమకి అవసరమైనది మాత్రం తీసుకుని మిగతాది ఇగ్నోర్‌ చేసేస్తారు. ఆ బ్యాలెన్స్‌ ఒక సెలబ్రిటీకి తెలియాలి. ఇంతకాలం మౌనంగా వున్న రేణు ఇప్పుడెందుకు పవన్‌ గురించి ఇలా మాట్లాడుతున్నట్టు?

ఇది కేవలం అభిమానుల వల్ల అనుకోవడం అవివేకమే అవుతుంది. ఖచ్చితంగా తనకి పవన్‌ అన్యాయం చేసాడనే భావనతో, తనకంటూ ఒక ఆధారం దొరికిన తర్వాత ఆమె తిరిగి ఇచ్చేస్తోంది. అలాగే మాజీ భర్తతో తనకిక ఎలాంటి సంప్రదింపులు వుండవనే విషయాన్ని తన కాబోయే భర్త కుటుంబానికి ఇలా తెలియజేస్తోందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు