త్రివిక్రమ్‌ మనసు మార్చుకున్నాడు

త్రివిక్రమ్‌ మనసు మార్చుకున్నాడు

ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత వీర రాఘవ' పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్‌ కొన్ని మీడియం బడ్జెట్‌ సినిమాలు చేసే ఆలోచనలో వున్నాడనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ నానితో ఒక సినిమా చేసేందుకు మాటలు కూడా అయిపోయాయి. స్టార్‌ హీరోలతో చిత్రాలంటే వారి ఇమేజ్‌ని బ్యాలెన్స్‌ చేసే పనిలో తనలోని రైటర్‌కి పని తగ్గిపోతుందని భావించిన త్రివిక్రమ్‌ 'అ ఆ' మాదిరిగా మధ్యస్తమయిన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు.

అయితే త్రివిక్రమ్‌తో పని చేయడానికి సిద్ధంగా వున్నానని అల్లు అర్జున్‌ నుంచి కబురు రావడంతో అతని సినిమా ఖాయం చేసేసాడట. విక్రమ్‌ కుమార్‌తో తదుపరి చిత్రం ఖాయం చేసుకున్న అల్లు అర్జున్‌ దాని ఫాలోఅప్‌గా వచ్చే సినిమా కమర్షియల్‌గా వుండాలని భావిస్తున్నాడట. అందుకే త్రివిక్రమ్‌తో చేస్తే సేఫ్‌ అని అతనితో ఖాయం చేసుకున్నాడట.

జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలతో అల్లు అర్జున్‌కి ఫ్యామిలీస్‌లో వున్న ఇమేజ్‌ని పటిష్టం చేసి అతని రేంజ్‌ని పెంచిన త్రివిక్రమ్‌ మళ్లీ బన్నీతో జత కలిస్తే బిజినెస్‌ పరంగా క్రేజ్‌ బాగా వుంటుంది. అల్లు అర్జున్‌తో చేసే సినిమాలకి ఎలాగో ఇమేజ్‌ లింకులు పెట్టుకోడు కనుక త్రివిక్రమ్‌కి ఆ ఇబ్బంది కూడా వుండదు. వచ్చే యేడాదిలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకి వెళ్లడం ఫిక్స్‌ చేసేసుకోవచ్చు.