లక్కీ హీరోయిన్స్‌... స్టోరీ అడ్డం తిరిగింది

లక్కీ హీరోయిన్స్‌... స్టోరీ అడ్డం తిరిగింది

విజయాలతో జర్నీ స్టార్ట్‌ చేసిన యువ హీరోయిన్లకి సడన్‌గా అదృష్ట లక్ష్మి మొహం చాటేసింది. అ ఆ, ప్రేమమ్‌తో తన టాలీవుడ్‌ కెరియర్‌కి సక్సెస్‌ఫుల్‌ బిగినింగ్‌ చూసిన అనుపమకి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. మిడిల్‌ రేంజ్‌ సినిమాలకి మోస్ట్‌ వాంటెడ్‌ మహాలక్ష్మి అనిపించుకున్న అనుపమకి తేజ్‌తో వరుసగా మూడో పరాజయం ఎదురయింది.

ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం తర్వాత అనుపమకి 'తేజ్‌'తోను ఫ్లాప్‌ తప్పలేదు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా బాగుంటుందని, మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుపమ కనిపించిన వారందరికీ చెప్పుకుంది కానీ ఆమె అంచనాలకి తగ్గట్టు ఈ చిత్రం ఆకట్టుకోలేదు.

అనుపమ పరిస్థితిలానే మెహ్రీన్‌కి కూడా ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు లాంటి హిట్లతో కెరియర్‌ స్టార్ట్‌ చేసిన మెహ్రీన్‌కి కేరాఫ్‌ సూర్య, జవాన్‌ తర్వాత పంతంతో మరో ఫ్లాప్‌ పడింది.

మీడియం రేంజ్‌ సినిమాల నుంచి స్టార్‌ హీరోల చిత్రాలకి ఎదగడానికి సక్సెస్‌ తప్పనిసరి అయిన టైమ్‌లో ఈ ఇద్దరూ లక్‌ కోల్పోయారు. వర్రీ అవ్వాల్సిన పని లేకుండా ఇద్దరికీ చేతిలో కొన్ని సినిమాలయితే వున్నాయి కానీ అర్జంటుగా ఈ ఫ్లాప్స్‌ నుంచి బయటపడకపోతే మాత్రం ఇక కొత్త అవకాశాలు రాని పరిస్థితి తలెత్తడం ఖాయం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English