ఫ్లాపుల కంటే డేంజర్‌ అపాయం ఇది!

ఫ్లాపుల కంటే డేంజర్‌ అపాయం ఇది!

విడుదలకి ముందు బజ్‌ తెచ్చుకోలేకపోయిన 'తేజ్‌'కి ఊహించినట్టుగానే ఓపెనింగ్స్‌ సరిగా రాలేదు. దానికి తోడు టాక్‌ కూడా బ్యాడ్‌గా రావడంతో సాయి ధరమ్‌ తేజ్‌ పరాజయాల పరంపరకి బ్రేకులు కూడా పడలేదు. అయితే ఈ చిత్రం ఫ్లాపవడం కంటే కూడా దీనికి వచ్చిన ఓపెనింగ్‌ వసూళ్లు ప్రస్తుతం హీరో స్థాయిని తెలియజేస్తున్నాయి.

రెండేళ్ల క్రితం వరకు సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాలకి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ వచ్చేవి. వరుసగా నాసి రకం సినిమాలు చేస్తూ పోవడంతో అతని మార్కెట్‌ దారుణంగా దెబ్బ తింది. మొదటి రోజు మాస్‌ సెంటర్లలో కూడా హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టించలేకపోయాడు. ఏ హీరోకి అయినా ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఫరవాలేదు కానీ, మొదటి రోజు మొదటి ఆటకే జనాలు లేకపోవడమనేది మాత్రం పెద్ద డేంజర్‌. ఒక హీరోని జనాలు లైట్‌ తీసుకుంటున్నారనే దానికది ఇండికేషన్‌.

వరుస ఫ్లాపులు రావడంతో ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై సాయి ధరమ్‌ తేజ్‌ చాలా కన్‌ఫ్యూజన్‌లో వున్నాడు. ఈ అయోమయంలోనే ఇంకా తప్పులు చేస్తున్నాడు. వినాయక్‌, కరుణాకరన్‌ లాంటి జ్యూస్‌ అయిపోయిన దర్శకులని నమ్మి తేజు బాగా దెబ్బతిన్నాడు. ఇంతకుముందు తను ఏంటి, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని కాకుండా మళ్ళీ తన కెరియర్‌ని పునర్నిర్మించుకోవడంపై దృష్టి పెడితే తనకే మంచిది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English