‘ఇంటిలిజెంట్’ కంటే దారుణం

‘ఇంటిలిజెంట్’ కంటే దారుణం

‘సుప్రీమ్’ సినిమా రిలీజయ్యే సమయానికి సాయిధరమ్ తేజ్ అందరికీ ఒక స్టార్ హీరోలా కనిపించాడు. రవితేజ సినిమాల స్థాయిలో అతడి చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక అక్కడి నుంచి కుర్రాడు ఇంకా ఎదుగుతాడని.. మరింతగా మార్కెట్ విస్తరించుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అంతటితో అతడి డ్రీమ్ రన్ ముగిసింది. అక్కడి నుంచి అంతా పతనమే. సినిమా సినిమాకూ అతడి మార్కెట్ పడిపోతూ వచ్చింది.

తేజు చివరి సినిమా ‘ఇంటిలిజెంట్’కు అసలేమాత్రం బజ్ లేదు. దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకప్పుడు ఆరేడు కోట్ల షేర్ రాబట్టగలిగిన తేజు.. ఈ సినిమాతో తొలి రోజు కేవలం రూ.2 కోట్ల షేర్‌తో సరిపెట్టుకున్నాడు. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.4 కోట్ల లోపే షేర్ తెచ్చింది. అంతకంటే దారుణమైన సినిమా తేజుకు మరొకటి ఉండదనే అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’ను మించిన సినిమా వచ్చింది. తేజ్ కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ వసూళ్లు దాని కన్నా ఘోరంగా ఉన్నాయి. తొలి రోజు ఈ చిత్రానికి రూ.1.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ముందు రోజు విడుదలైన ‘పంతం’కు టాక్ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ తేజు సినిమా ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. తేజు ట్రాక్ రికార్డే పేలవం అంటే.. అతడికి కరుణాకరన్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్ తోడయ్యాడు. దీంతో ఈ సినిమాకు అసలేమాత్రం బజ్ లేకపోయింది. పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి.

సినిమాను నెగెటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో తర్వాత అయినా పుంజుకుంటుందా అన్నది సందేహమే. ఇది కూడా ఫుల్ రన్లో ‘ఇంటిలిజెంట్’ స్థాయిలోనే వసూళ్లు రాబట్టేలా ఉంది. సినిమా చాలా బాగుంటుందని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణించిన సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుకు ఇది భారీ నష్టాలే మిగిల్చేలా ఉంది. పాపం ఈ సినిమాకు సరిగా బిజినెస్ కూడా చేసుకోలేకపోయారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English