సినిమాల వరదే బాబోయ్..

సినిమాల వరదే బాబోయ్..

పెద్ద సినిమాలు కొంచెం సైడిస్తే చాలు.. థియేటర్లలోకి చిన్న సినిమాలు వరుస కట్టేస్తుంటాయి. వేసవిలో భారీ సినిమాల మోత ముగిశాక పరిస్థితి అలాగే ఉందిప్పుడు. జూన్ నెలలో డబ్బింగ్‌వి పక్కన పెడితే15కు పైగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. జులైలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఆల్రెడీ షెడ్యూల్ అయినవాటికి తోడు.. చాన్నాళ్లుగా విడుదల కోసం చూస్తున్న సినిమాల్ని ఈ నెలలోనే వదిలేస్తున్నారు.

తొలి వారంలో గోపీచంద్ సినిమా ‘పంతం’తో పాటు సాయిధరమ్ తేజ్ మూవీ ‘తేజ్ ఐ లవ్యూ’ విడుదలయ్యాయి. ఇక వచ్చే వారం మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం కానున్న ‘విజేత’తో పాటు ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’, కార్తి నటించిన డబ్బింగ్ సినిమా ‘చినబాబు’ విడుదల కాబోతున్నాయి.

ఆక జులై 20 కోసం మూడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దిల్ రాజు సినిమా ‘లవర్’. ఆ తేదీకి ముందుగా ఫిక్సయింది ఆ చిత్రమే. దీనికి మంచు లక్ష్మి సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ కూడా పోటీగా తయారైంది. కొంచెం లేటుగా 20వ తేదీ రేసులోకి వచ్చిన సినిమా ‘ఆటగదరా శివ’. చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరూ కొత్తవాళ్లే నటించారు.

ఇక జులై చివరి వారానికి కొంచెం పెద్ద స్థాయి సినిమానే ఫిక్సయింది. అదే.. సాక్ష్యం. ఎప్పుడో ఫిబ్రవరిలోనే వస్తుందని ప్రకటించిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు జులై 27న విడుదలకు ముస్తాబవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు.

ఇక అదే వీకెండ్లో కొణిదెల వారి అమ్మాయి నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికి ఈ నెలకు ఫిక్సయిన సినిమాలివి. కుదిరితే ఇంకో రెండు మూడు సినిమాలు కూడా వీటికి తోడైనా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు