వైఎస్ డబ్బింగ్ ఎలాగబ్బా?

 వైఎస్ డబ్బింగ్ ఎలాగబ్బా?

వారం కిందటే విడుదలైన హిందీ సినిమా ‘సంజు’ సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ హిరాని దర్శకత్వ ప్రతిభ ఒకెత్తయితే.. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ అభినయం మరో ఎత్తు. అచ్చం సంజులా ఆహార్యాన్ని మార్చుకుని.. సంజులాగా నడుస్తూ.. సంజు లాగా అభినయిస్తూ అదరగొట్టేశాడు రణబీర్. ఇంకెవరూ కూడా సంజయ్ పాత్రను ఇంత బాగా చేసేవాళ్లు కాదేమో అన్నట్లుగా అతను ఆ పాత్రలో జీవించేశాడు. కేవలం సంజు లాగా మేకప్ వేసుకుని.. అతడి బాడీ లాంగ్వేజ్‌ను అనుకరించడం మాత్రమే కాదు.. సంజులాగా డైలాగ్స్ కూడా చెబుతూ మెస్మరైజ్ చేశాడు రణబీర్. అందుకే అతను ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. ఎవరైనా ప్రముఖుల బయోపిక్ తీస్తుంటే వాళ్లకిది ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ఇక తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సైతం అద్భుత అభినయం కనబరిచింది. కానీ వాయిస్ విషయంలో మాత్రం సావిత్రిని కీర్తి మ్యాచ్ చేయలేకపోయింది. సినిమాలో ఇదొక్కటి లోపంగా కనిపించింది. ఇక ‘యన్.టి.ఆర్’ సినిమాలో బాలయ్య తన తండ్రి వాయిస్‌ను ఎలా అనుకరిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐతే ఎన్టీఆర్ కొడుకే కాబట్టి బాలయ్యకు అది పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యాత్ర’లో మమ్ముట్టి వైఎస్ పాత్రలో ఎలా ఒదిగిపోతాడు.. ఆయనలా ఎలా మాట్లాడతాడు అన్నది సందేహం. మమ్ముట్టి గొప్ప నటుడే కానీ.. రాజకీయ నాయకుడైన వైఎస్ హావభావాల్ని అనుకరించడం అంత సులువైన విషయం కాదు. ఇదొక సవాలు అయితే.. వైఎస్ వాయిస్‌ను ఆయన ఇమిటేట్ చేయడం మాత్రం సవాలే. అసలే పరభాషా నటుడు. తెలుగు తెలియదు. అలాంటపుడు స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ వైఎస్‌ను మ్యాచ్ చేయడం ఈజీ కాదు. అలాగని డబ్బింగ్ చెప్పిస్తే సహజంగా ఉండదు. బయోపిక్‌లకు సొంత వాయిస్ ఉంటేనే బాగుంటుంది. మరి ఈ విషయంలో దర్శకుడు మహి.వి.రాఘవ్ ప్లాన్ ఏంటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English