రెజీనా అందాలు పని చేశాయి

రెజీనా అందాలు పని చేశాయి

తెలుగులో కథానాయికగా ఒక టైంలో ఫుల్ బిజీగా ఉండేది రెజీనా కసాండ్రా. మీడియం రేంజి హీరోలతో వరుస విజయాలందుకుంటూ.. ఇంకా పెద్ద రేంజి హీరోల్ని అందుకునే దిశగా వడివడిగా అడుగులేస్తున్నట్లు కనిపించిందీ చెన్నై భామ. కానీ పాపం... వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. తిరిగి చెన్నై వెళ్లిపోయేలా చేశాయి. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు అమ్మడికి.

ఐతే లేక లేక ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో రెజీనాకు పెద్ద రోల్ దొరికింది. ఈ సినిమాతో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్లుగా కెరీర్లో ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతకు సిద్ధమైంది రెజీనా. ఈ చిత్ర ప్రోమోల్లో రెజీనా లుక్స్ చూసి అందరూ షాకైపోయారు. ఆ రేంజిలో ఎక్స్‌పోజింగ్ చేసిందామె. ముఖ్యంగా సముద్రపు ఒడ్డున విపరీతంగా అందాలు ఆరబోస్తూ హీరో గౌతమ్ కార్తీక్‌తో ఆమె చేసిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట సినిమాపై అంచనాల్ని పెంచింది. ఈ శుక్రవారమే ‘మిస్టర్ చంద్రమౌళి’ తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కేవలం రెజీనా అందాలే కాదు.. అంతకుమించి ఆకర్షణలు కూడా సినిమాలో ఉండటంతో దీనికి హిట్ టాక్ వచ్చింది. గౌతమ్ కార్తీక్.. తన తండ్రి, సీనియర్ నటుడు కార్తీక్‌తో కలిసి నటించిన తొలి సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ఆసక్తికరంగా సాగి ప్రేక్షకుల్ని అలరిస్తోందట. ఇక రెజీనా అందాలు కూడా కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంటున్నాయి. కెరీర్లో తొలిసారిగా ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది రెజీనా. ఆ విషయంలోనూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. మొత్తానికి కెరీర్ చరమాంకంలో రెజీనా ఒక మంచి సక్సెస్ ఖాతాలో వేసుకోబోతున్నట్లే ఉంది. మరి ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఊపునిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు