చరణ్‌ కోసం.. కలక్షన్లు ఆపేశారుగా..

చరణ్‌ కోసం.. కలక్షన్లు ఆపేశారుగా..

రామ్ చరణ్ తేజ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ గా మిగిలిపోయింది రంగస్థలం మూవీ. అచ్చ తెలుగు పల్లెటూరి కథతో డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు. ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడమే కాదు.. ఎప్పుడో మరిచిపోయిన రికార్డులను గుర్తు చేస్తోంది.

మొదటి రెండు.. మూడువారాల్లో వీలయినంత కలెక్షన్లు రాబట్టి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేయడమనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. కానీ వీటికి భిన్నంగా రంగస్థలం 50 రోజులకు కూడా మంచి కలెక్షన్లతో నడిచింది. ఇప్పుడు అది కూడా దాటి 100 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఈమధ్య కాలంలో ఇన్ని రోజులు ఆడిన సినిమా ఇదొక్కటే. ఈ సినిమా కలెక్షన్లు ఎంత కొల్లగొట్టిందంటూ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా రిలీజైన మొదట్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే విషయం పోస్టర్లపై వేశారు.

అనవసరమైన పోటీకి తెర లేపుతున్నాననే ఉద్దేశంతో తన సినిమా పోస్టర్ పై ఎక్కడా కలెక్షన్ల విషయం ప్రింట్ చేయొద్దని నిర్మాతలకు చెబుతానని రామ్ చరణ్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నమాట మీద నిలబడుతూ ఇంతకు ముందొచ్చిన 50 రోజుల పోస్టర్ మీదగానీ.. ఇప్పుడొచ్చిన 100 రోజుల పోస్టర్ మీదకానీ ఎక్కడా కలెక్షన్ల లెక్కలు లేవు. రంగస్థలం ఎంత కొల్లగొట్టింది ఎంత అనే విషయంగా ఆ నోటా.. ఈనోటా విని తెలుసుకోవాలి తప్ప ఎంత వచ్చిందనేది పోస్టర్ పై చూసి తెలుసుకునే అవకాశం లేదు. అదీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు