స్టయిల్ మార్చి స్పీడు పెంచాడు

స్టయిల్ మార్చి స్పీడు పెంచాడు

కమెడియన్ నుంచి పూర్తిస్థాయి హీరోగా మారాక సునీల్ మొదట్లో కాస్తంత హిట్లు పలకరించాయి. ఆ తరవాత వరస ఫ్లాపులతో సతమతం అవుతూనే ఉన్నాడు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలిసిరాక కమర్షియల్ అంటే అనేది అందకుండా పోయింది. సోలో హీరోగా కంటిన్యూ అవడం కష్టమని తేలిపోవడంతో తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

సునీల్ ఆలోచన మార్చుకున్నప్పటి నుంచి మంచి ఆఫర్లు అన్నీ అతడిని వెతుక్కంటూ వస్తున్నాయి. తాజాగా నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తరవాత తీయబోయే సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సునీల్ ను తీసుకున్నాడు. చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో వస్తున్న ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తేజు ఫ్రెండ్ గా సునీల్ కనిపించబోతున్నాడు. కథలో ఇది ఓ కీలకమైన పాత్ర కావడంతోనే సునీల్ హ్యాపీగా ఓకే చెప్పేశాడని ఈ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ - రితికా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తన ఫ్రెండ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చాలా రోజుల తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడు. దీంతో పాటు శర్వానంద్ - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పడిపడి లేచే మనసులోనూ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. చూడబోతే కొత్త ఇన్నింగ్స్ లో సునీల్ దూకుడుగానే కనిపించబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English