పాతిక మిలియన్ల కోసం హీరోయిన్ల ఫ్యాన్స్ గొడవ

పాతిక మిలియన్ల కోసం హీరోయిన్ల ఫ్యాన్స్ గొడవ

బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకునే.. ప్రియాంక చోప్రా చాలా కాలంగా టాప్ పొజిషన్ కోసం పోటా పోటీగా దూసుకెళ్తున్నారు. ప్రతి విషయంలోనూ వీళ్లిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెళ్లి కండల వీరుడు డ్వేన్ జాన్సన్ పక్కన బేవాచ్ సినిమా చేసింది. అదే టైంలో దీపికా యాక్షన్ హీరో విన్ డీజెల్ పక్కన ట్రిపుల్ ఎక్స్ పార్ట్ 2 లో హీరోయిన్ గా చేసింది.

అవార్డులు.. రికార్డులు కూడా వీరిద్దరి పేరిట చాలానే ఉన్నాయి. దాంతో మా హీరోయిన్ గొప్పంటే.. మా హీరోయిన్ గొప్పంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు రచ్చ చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ కు టచ్ లో ఉండేలా ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరిని 25 మిలియన్ల మందికిపైగా ఫాలో అవుతుండటం విశేషం. కాకపోతే ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ లో ఎంటరై 2,580 పోస్టులు పెట్టాక ఈ మార్క్ చేరుకుంది. దీపికా మాత్రం 648 పోస్టులతోనే ప్రియాంకకు సమానమైన ఫాలోయర్లను సంపాదించుకోగలిగింది. ఎవరు ఏ చిన్న పోస్టు పెట్టినా కాసేపట్లోనే ఫ్యాన్స్ మరో హీరోయిన్ తో పోలుస్తూ నెగిటివ్ కామెంట్లతో హంగామా చేసేస్తున్నారు. మా హీరోయిన్ గొప్ప అంటే మా హీరోయిన్ గొప్ప అంటూ రచ్చ చేస్తున్నారు.

ప్రియాంక పాపులర్ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో లవ్ లో పడిందని.. తల్లిదండ్రలను ఒప్పించేందుకు అతడిని ఇండియాకు వెంటబెట్టుకుని తీసుకొచ్చిందని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. ఇదే టైంలో దీపికా హీరో రణ్ వీర్ సింగ్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని.. ఈ ఏడాదిలోనే అతడిని పెళ్లి చేసుకుంటోందనే మాట వినిపిస్తోంది. వీళ్లిద్దరి ప్రణయగాథలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మరీ ఎక్కువైంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English