రూమర్: నాగ్ సినిమా అందుకే కొన్నాడట

రూమర్: నాగ్ సినిమా అందుకే కొన్నాడట

టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు సుశాంత్ చాలా రోజులుగా ట్రయ్ చేస్తూనే ఉన్నాడు. ఫ్లాపులు.. యావరేజ్ సినిమాలు తప్ప ఒక్క సూపర్ హిట్ మూవీ కూడా అతడి ఖాతాలో పడలేదు. ఈమధ్య వరస ఫ్లాపులతో కాస్తంత బ్రేక్ ఇచ్చాడు. తాజాగా ‘‘చి ల సౌ’’ అనే సినిమా చేస్తున్నాడు.

అందాల రాక్షసి ఫేం హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న చి ల సౌ సినిమా మొదలుపెట్టి చాలా రోజులైంది. చివరలో పెట్టుబడి తగ్గి సినిమా నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో సుశాంత్ మేనమామ.. హీరో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా బాధ్యత తీసుకోవడానికి కారణం మేనల్లుడు సుశాంత్ ఒక్కటే కారణం కాదని ఫిలింనగర్ జనాలు చెబుతున్నారు. చి ల సౌ సినిమాకు సంబంధించి ఇంతవరకు అయిన వర్క్ మొత్తం నాగార్జున స్వయంగా చూశాడట. సినిమా కాన్సెప్ట్ తెరకెక్కించిన విధానం చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది.

మనం.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాల తరవాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కు సరైన హిట్ పడలేదు. భారీ బడ్జెట్ తో హలో.. లిమిటెడ్ బడ్జెట్ తో రంగులరాట్నం తీసినా రెండూ ఫ్లాపులే అయ్యాయి. ఇప్పుడు ఈ బ్యానర్ కు అర్జంటుగా హిట్ అవసరమని  అక్కినేని ఫ్యామిలీ కోరుకుంటోంది. ఈ టైంలో చి ల సౌ మీద నాగార్జునకు కాన్ఫిడెన్స్ రావడంతో రైట్స్ మొత్తం ఒకేసారి కొనేశాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇటు హిట్ కొట్టినట్టు ఉంటుంది... అటు మేనల్లుడికి హెల్ప్ చేసినట్టు ఉంటుందనేది నాగార్జున స్ట్రాటజీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English