తెర వెనక్కి పంపేసిన మాస్ రాజా

తెర వెనక్కి పంపేసిన మాస్ రాజా

కెరీర్ లో హిట్టు ఫ్లాపులు అన్నదానితో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. రీసెంట్ గా అతడు నటించిన రెండు సినిమాలు టచ్ చేసి చూడు.. నేలటిక్కెట్టు సినిమాలు బాక్సాఫీస్ ను బాగా నిరాశపరిచాయి. రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోవడం అభిమానులను నిరాశపరిచింది.

ఈ రెండు సినిమాల ఫలితం నుంచి రవితేజ తొందరగానే కోలుకుని తరవాత సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం కెరీర్ మొదట్లో తనకు హిట్లిచ్చి లైఫిచ్చిన శ్రీను వైట్ల డైరెక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు తమిళ స్టార్ హీరో తెరి రీమేక్ లో నటించడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా సెకండాఫ్ లో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చాలా మార్పులు స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఈ స్క్రిప్ట్ తోనే కందిరీగ ఫేం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ రెండేళ్లకు పైగా కుస్తీ పడుతున్నాడు.

అమర్ అక్బర్ ఆంటోని - తెరి రీమేక్ రెండింటి షూటింగ్ ఒకేసారి చేద్దామని ముందు నుంచి రవితేజ ఆలోచిస్తున్నా ప్రస్తుతం మనసు మార్చుకున్నాడు. ప్రస్తుతం రవితేజ ఫోకస్ మొత్తం అమర్ అక్బర్ ఆంటోనిపైనే పెట్టాడు. తెరి రీమేక్ సంగతి తరవాత చూద్దామని నిర్మాతలకు చెప్పేశాడని తెలుస్తోంది. దీంతో మిగతా వాళ్ల సంగతెలా ఉన్నా సంతోష్ శ్రీనివాస్ బాగా డీలాపడటం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు