​బ్రహ్మి కొడుకు సినిమాకు ఇన్ని కష్టాలా?

​బ్రహ్మి కొడుకు సినిమాకు ఇన్ని కష్టాలా?

బ్రహ్మానందం.. తెలుగు సినిమా చరిత్రలోనే.. ఆ మాటకొస్తే భారతీయ సినీ చరిత్రలోనే గ్రేటెస్ట్ కమెడియన్లలో ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన హవా సాగింది. ఒక సమయంలో హీరో హీరోయిన్లతో దీటుగా పారితోషకం తీసుకున్నారాయన. 30 ఏళ్లకు పైగా విరామం లేకుండా సినిమాల్లో నటించిన ఆయన ఎంత సంపాదించి ఉంటారో లెక్క వేయడం కష్టం.

ఈ మధ్య కొంచెం అవకాశాలు తగ్గి ఖాళీగా ఉంటున్నారాయన. అయినప్పటికీ ఆయనకు ఏ లోటూ లేదు. అలాంటి వ్యక్తి తన కొడుకు గౌతమ్‌ను హీరోగా నిలబెట్టలేకపోయాడు. గౌతమ్ కథానాయకుడిగా నటించిన మూడు సినిమాలూ ఫెయిలయ్యాయి. అతను అడ్రస్ లేకుండా పోయాడు.

ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత గౌతమ్ ‘మను’ అనే సినిమాలో నటించాడు. షార్ట్ ఫిలిమ్స్‌తో పేరు సంపాదించిన ఫణీంద్ర నరిశెట్టి డైరెక్ట్ చేసిన చిత్రమిది. దీనికి నిర్మాతంటూ ఎవరూ లేరు. సోషల్ మీడియాలో క్యాంపైన్ ద్వారా క్రౌడ్ ఫండింగ్‌తో నిర్మించిన చిత్రమిది. గత ఏడాదే ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ రిలీజయ్యాయి. అవి కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే చివరి దశలో ఫండింగ్ సరిపోక.. రిలీజ్ చేయడానికి డబ్బులు లేక సినిమా ఆగిపోయింది. గౌతమ్ కూడా ఈ సినిమాను బయటికి తేలేకపోయాడు. దీంతో సినిమా పూర్తిగా పక్కన పడిపోయింది.

ఐతే ఇటీవలే యుఎస్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో పేరు మోసిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని తన చేతికి తీసుకుంది. ఫండింగ్ చేసి మిగతా పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో గౌతమ్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు