శర్వా ఈసారి మాయ చేస్తాడట

శర్వా ఈసారి మాయ చేస్తాడట

తెలుగులో ఉన్న టాలెంటడ్‌ అండ్‌ పెర్‌ఫార్మింగ్‌ హీరోల్లో శర్వానంద్‌ ఒకడు. ఇతనికి సరైన హిట్టు రాకపోవడం వలన, ఇండస్ట్రీలో సరిగ్గా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఈ మధ్యనే సొంత సినిమా చేసి చేతులు కాల్చుకున్న శర్వానంద్‌, ఇప్పుడు తన మాయ ఏంటో అందరికీ చూపిస్తానంటున్నాడు.

ప్రస్తుతం మనోడి చేతిలో రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్న సత్య-2, పాపులర్‌ తమిళ దర్శకుడు చేరన్‌ తీస్తున్న 'ఏమిటో ఈ మాయ' అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఏమవ్వుద్దో తెలియని రాము సినిమాని ప్రక్కన పెట్టేస్తే, చేరన్‌ సినిమాపైన మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాడు శర్వా.

సున్నితమైన లవ్‌ స్టోరీలు తియ్యడంలో చేరన్‌ పెద్ద ఎక్స్‌పర్ట్‌. మనోడు తీసిన సినిమాలన్నీ యావరేజ్‌ అనిపించుకున్నా కూడా కలెక్షన్లు మాత్రం ఇరగదీస్తాయి. అందుకే శర్వానంద్‌కు ఈ సినిమా మీద అంత నమ్మకం. ఇక ఈ సినిమాలో లవ్‌స్టోరీలకు పెట్టిందిపేరుగా మారిన నిత్యామీనన్‌ మరోసారి తన మ్యాజిక్‌ చెయ్యడానికి సిద్దపడింది. మరి చూద్దాం శర్వానంద్‌ మాయ ఎలా ఉండబోతుందో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు