మెగా హీరోల రేంజికి అర్జున్ రెడ్డి

మెగా హీరోల రేంజికి అర్జున్ రెడ్డి

సినిమా హీరోలను కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. ఆ టైంకు ఎవరు ఫాంలో ఉంటే వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని కంపెనీలు తమ ప్రోడక్స్ ను పెంచుకోవాలని చూస్తుంటాయి. స్టార్ ఇమేజ్ గ్యారంటీగా ప్లస్ అవుతుందని నమ్మకం ఉన్నవారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి.

ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ మొబైల్స్ కనిపిస్తూనే ఉంటాయి. యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే గాడ్జెట్ ఇది. అందుకే యూత్ లో ఫాలోయింగ్ ఉన్న హీరోలనే మొబైల్ స్టోర్లు తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటాయి. ఇంతకు ముందు మెగా హీరోల్లోని అల్లు అర్జున్ - రామ్ చరణ్ తేజ్ లు రెండు మొబైల్ స్టోర్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. తాజాగా యూత్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ రేంజ్ కు చేరాడు. పెళ్లిచూపులు - అర్జున్ రెడ్డి సినిమాలతో యూత్ లో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్న  ఈ హీరో ఓ మొబైల్ స్టోర్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. రీసెంట్ గా ఇందుకు ఒప్పుకున్న విజయ్ దేవరకొండ అప్పుడే ఆ స్టోర్ కోసం పబ్లిసిటీ మొదలుపెట్టాడు. కేవలం రెండు మూడు సినిమాలకే అప్పుడే 70-80 కోట్ల మార్కెట్ కలిగిన మెగా హీరోలకు పోటీగా మరో మొబైల్ స్టోర్ కు మనోడు అంబాసిడర్ అవ్వడం.. ఆశ్చర్యపరిచే విషయమే.

ఇకపోతే విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం మెగా క్యాంప్ లోనే వరసగా సినిమాలు చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో గీతగోవిందం..  టాక్సీవాలా సినిమాలు చేస్తున్నాడు. గీత గోవిందం మూవీని పరశురాం డైరెక్ట్ చేస్తుండగా.. టాక్సీ వాలాకు కొత్త డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు