లవ్ స్టోరీని నమ్ముకున్నాడు.. ఏమవుతుందో?

లవ్ స్టోరీని నమ్ముకున్నాడు.. ఏమవుతుందో?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలతో ‘రేయ్’ చేశాడు. ఆ సినిమా అతడికి చేదు అనుభవం మిగిల్చినా.. తర్వాత అదృష్టం కలిసొచ్చి వరుసగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ సినిమాలు హిట్టయ్యాయి. హ్యాట్రిక్ హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు కుర్రాడు.

మెగా ఫ్యామిలీకి తోడు అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యాకప్ కూడా ఉండటంతో తేజు కెరీర్ ఇంకో స్థాయికి చేరుతుందని.. అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడని అంతా అంచనా వేశారు. కానీ ఆ తర్వాత సినిమాల ఎంపికలో వేసిన తప్పటడుగులు అతడి కొంపముంచాయి. వరుసగా ఐదు డిజాస్టర్లతో కుర్రాడు రేసులో బాగా వెనుకబడిపోయాడు. తేజు సినిమా వస్తోందంటే ఒకప్పుడున్న క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ‘తేజ్ ఐ లవ్యూ’ సంగతీ అంతే.

మధ్యలో తన శైలికి నప్పే యాక్షన్ ఎంటర్టైనర్లతో సాగిపోయిన తేజు.. ఇప్పుడు కెరీర్లో తొలిసారిగా పూర్తి స్థాయి ప్రేమకథ చేశాడు. ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరన్‌ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్యూ’లో నటించాడు. దీని ట్రైలర్ చూస్తే ఏమంత కొత్తగా అనిపించలేదు. ట్రైలర్ మొత్తంలో మరీ ఎగ్జైటింగ్‌గా అనిపించే విశేషాలేమీ కూడా కనిపించడం లేదు. కరుణాకరన్ తన టచ్ కోల్పోయి చాలా కాలమే అయింది.

ఇప్పుడు మళ్లీ అతడి మ్యాజిక్ కనిపిస్తుందా అన్న సందేహాలున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది. మంచి టేస్టున్న నిర్మాతగా పేరున్న కె.ఎస్.రామారావు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తేజూలోనూ ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. మరి నిజంగా సినిమాలో అంతుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. యాక్షన్ సినిమాలు ముంచేశాక ప్రేమకథను నమ్ముకున్న తేజు.. ఈ సినిమాతో అయినా పుంజుకుంటాడేమో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English