మోక్షజ్ఞకు ఇంకో క్యారెక్టర్ రాసేశారు

మోక్షజ్ఞకు ఇంకో క్యారెక్టర్ రాసేశారు

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఏదో ఒక రోజు సినిమాల్లోకి రావాల్సిందే. అతడి అరంగేట్రం గురించి బాలయ్య ఇప్పటికే ప్రకటన కూడా చేశాడు. ఆయన చెప్పిన ప్రకారమైతే గత ఏడాదే అతను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ తొలి సినిమా చేసే సంకేతాలేమీ కనిపంచడం లేదు.

కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఏదో ఒక వార్త పుట్టిస్తూనే ఉన్నారు. గత ఏడాది బాలయ్య వందో సినిమాగా విడుదలైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మోక్షజ్ఞ ఓ పాత్ర పోషిస్తాడని ప్రచారం చేశారు. శాతకర్ణి తనయుడు పులోమావి పాత్రలో అతను కనిపిస్తాడన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఇప్పుడేమో బాలయ్య కథానాయకుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ నటిస్తాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో చిన్నప్పటి బాలయ్యగా మోక్షజ్ఞ నటించబోతున్నాడంటూ ప్రచారం మొదలైపోయింది. అప్పుడు అతడి కోసం పులోమావి క్యారెక్టర్ రాసినట్లే ఇప్పుడు బాలయ్య పాత్రను సృష్టించేశారు. ‘శాతకర్ణి’ సినిమా టైంలో మోక్షజ్ఞ క్రిష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు వార్తలొచ్చాయి.

ఆయనే మోక్షజ్ఞతో బాలయ్య పాత్ర వేయిస్తున్నాడంటున్నారు. కానీ నేరుగా హీరోగా పరిచయం చేయకుండా మోక్షజ్ఞతో ఇలా గెస్ట్ క్యారెక్టర్ చేయించాలని బాలయ్య అనుకుంటాడా అన్నది డౌటు. మరి ఈ ఊహాగానాల్లో నిజం ఎంతో.. నిజంగా ‘యన్.టి.ఆర్’ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు