బన్నీ కోసం ఇలియానాను అడిగారా??

బన్నీ కోసం ఇలియానాను అడిగారా??

గోవా నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో జత కట్టి ఆడిపాడింది. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన బర్ఫీలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసి బాలీవుడ్ కు వెళ్లింది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమా తరవాత టాలీవుడ్ కు టాటా చెప్పి ముంబయికి మకాం మార్చేసింది. ఆ తరవాత తెలుగు సినిమా ఆఫర్లు వచ్చినా తిరిగి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. ఎంత ప్రయత్నించినా బాలీవుడ్ లో ఆఫర్లేమీ రాలేదు. చివరకు తెలుగులో రవితేజ పక్కన హీరోయిన్ చేసేందుకు ఓకే చెప్పింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వస్తున్న అమర్ అక్బన్ ఆంటోనీ షూటింగ్ సెట్లో ఆమె జాయినైపోయింది. ఇలియానా చాలామంది హీరోలకు లక్కీ హీరోయిన్. ఆమె నటించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్లయ్యాయి. ఆమె తిరిగి రావడంతో టాలీవుడ్ లో నిర్మాతలు - దర్శకులు ఇలియానా వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఓ స్టార్ హీరోతో తీయబోయే సినిమా కోసం ఇలియానాను సంప్రదించారని టాక్. విక్రమ్ కుమార్ డైరక్షన్లో బన్నీ చేయబోయే సినిమా కోసం.. ఇలియానాను అడిగినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ క్రితం బన్నీతో జులాయ్ చేశాకనే ఇల్లీ ఇక్కడ నుండి మాయమైంది. అయినా కూడా ఇన్నాళ్ల తరవాత వచ్చినా తెలుగులో తనకు లభిస్తున్న ఆదరణతో ఇలియానా కూడా ఆనందంగానే ఉంది. క్రేజ్ ఉన్న హీరోయిన్ కు మన నిర్మాతలు బాగానే ముట్టజెబుతారు కాబట్టి ఇల్లీ బేబీ ఇంకొన్నాళ్లు తెలుగులో కంటిన్యూ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు