చెన్నై చిన్నది మళ్లీ ప్రేమలో పడిందా?

చెన్నై చిన్నది మళ్లీ ప్రేమలో పడిందా?

చెన్నై చిన్నది త్రిష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. నిన్న మొన్నటివరకు ఇటు టాలీవుడ్... అటు కోలీవుడ్ ను ఏలేసింది. యంగ్ హీరోలు మొదలెట్టి స్టార్ హీరోల వరకు ఆమే ఫస్ట్ ఛాయిస్ గా ఉండేది. క్యూట్ గా ఉండే ఫేస్.. అందమైన చిరునవ్వు..  అట్రాక్టివ్ ఫిజిక్ త్రిషకు ప్లస్ పాయింట్లు.

ఈమధ్య ఏజ్ కాస్త పెరగడంతో బ్యూటీ తగ్గి త్రిష రేసులో వెనుకబడిపోయింది. దాంతోపాటే స్టార్ హీరోల పక్కన ఛాన్సులూ తగ్గాయి. అయినా త్రిష మరీ ఖాళీగా ఏమీ లేదు. మీడియం బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల్లో ఆమెకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. సాధారణంగా హీరోయిన్లకు క్రేజ్ తగ్గాక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతుంటారు. త్రిష వద్ద ఈ మాటెత్తితే ఏవో ఆన్సర్లిచ్చి మాట దాటేస్తుంది తప్ప ఏం చెప్పదు. ఎవరితోనే ప్రేమలో పడటం... కొన్నాళ్లకు దానిని మరిచిపోవడం ఈ బ్యూటీకి మామూలే. ఈమధ్య త్రిష మరోసారి ప్రేమలో పడిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

దీనికి తగ్గట్టు త్రిష తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తుంటే ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అనిపిస్తోంది. ‘‘ఎ టేబుల్ ఫర్ టూ’’ అంటూ రెండు లవ్ సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది. ఇంతకీ త్రిష ఈసారి మనసు పారేసుకుంది ఎవరిపైనా అని కోలీవుడ్ జనాలు ఆరా తీస్తున్నారు. చూద్దాం.. ఇవ్వాళో రేపో ఆ విషయం బయటకు రాకుండా ఉంటుందా? కెనడాకు చెందిన ఒక తమిళ బిజినెస్ మ్యాన్ ను డేటింగ్ చేస్తోందని ఇప్పటికే చాలా రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు