మలయాళం చై-శామ్.. మళ్ళొస్తున్నారు

మలయాళం చై-శామ్.. మళ్ళొస్తున్నారు

కెరీర్ మంచి జోష్ మీదున్నప్పుడు హీరోలు కానీ.. హీరోయిన్లు కానీ పెళ్లి మాటెత్తడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ స్టార్లుగా ఉన్నప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారు క్యూట్ కపుల్ నాగచైతన్య - సమంత. పెళ్లి చేసుకున్నాక కూడా ఇద్దరూ నటనను కంటిన్యూ చేస్తున్నారు.

టాలీవుడ్ లో చై - సామ్ లాగే మళయాళంలో ఓ స్టార్ కపుల్ ఉంది. ఇందులో అబ్బాయి ఫహాద్ ఫాజిల్ మనకు పెద్దగా పరిచయం లేడు. కానీ అమ్మాయి బాగానే పరిచయం. ఆమే అట్లీ డైరెక్ట్ చేసిన రాజా-రాణి సినిమాలో నటించిన నజ్రియా నజీమ్. వీళ్లిద్దరూ కలిసి బెంగుళూర్ డేస్ - ప్రమణి సినిమాల్లో నటించారు. ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత నజ్రియా యాక్టింగ్ కు గ్యాపిచ్చింది. నాలుగేళ్ల తరవాత తిరిగి మళ్లీ సినిమా సెట్లోకి అడుగుపెడుతోంది. మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ చెల్లెలిగా కూడె సినిమాలో నటిస్తోంది.

లేటెస్ట్ గా నజ్రియా - ఫహాద్ కలిసి ఓ సినిమాలో జంటగా నటించడానికి ఓకే చెప్పారు. నిజజీవితంలో జంట అయిన ఇద్దరూ వెండితెరపై జంటగా కనిపించడం కాస్తంత అరుదే. అందులోనూ ఫ్యాన్స్ లో బాగా క్రేజ్ ఉన్న కపుల్ కావడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అప్పుడే ఆసక్తి పెరిగింది. టాలీవుడ్ లోనూ చై-సామ్ తిరిగి జంటగా నటించాలని అభిమానులు ఎఫ్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. శివ నిర్వాణ డైరక్షన్లో అందుకే ఒక సినిమా ఓకే చేశారు మన జంట. మొత్తానికి జంటల జంట సినిమాలు భలే ఉన్నాయిలే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English