రాజమౌళి - దేవా కట్టా కాంబో రిపీట్

రాజమౌళి - దేవా కట్టా కాంబో రిపీట్

టాలీవుడ్ లోనే కాదు.. మొత్తం సౌతిండియాలోనే టాప్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే వినిపిస్తుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను శిఖర స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభ జక్కన్నది. అంత పెద్ద దర్శకుడూ టాలీవుడ్ లో ఇంకొందరి ప్రతిభకు తెగ ముచ్చట పడిపోతుంటాడు. బాహుబలి-1 సినిమాలో ఓ సీన్ లో ప్రస్థానం ఫేమ్ డైరెక్టర్ దేవా కట్టా ఆయనకు రచనా సహకారం అందించాడు. అందుకోసం సినిమా టైటిల్స్ లో థ్యాంక్స్ కార్డ్ కూడా వేశారు.

మరోసారి రాజమౌళి - దేవాకట్టా కలిసి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. బాహుబలికి ప్రీక్వెల్ గా ప్రస్తుతం శివగామి పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. ఆనంద్ నీలకాంత్ రాసిన ‘శివగామి’ బుక్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో శివగామి రాజమాత ఎలా అయింది.. కట్టప్ప సింహాసనానికి కట్టుబడి ఉంటానని ఏ పరిస్థితుల్లో వాగ్దానం చేశాడు లాంటి విశేషాలన్నీ ఉంటాయి.  ఈ వెబ్ సిరీస్ కోసమే రాజమౌళి - దేవా కట్టా కలిసి పనిచేయబోతున్నారనేది ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

దీనిని రాజమౌళి డైరెక్ట్ చేస్తాడనే మాట వినిపించినా ప్రస్తుతం ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ పనుల్లో బిజీగా ఉన్నందున అది కుదిరే పని కాదు. తాను దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం చూస్తూ దేవా కట్టాకు డైరెక్షన్ బాధ్యతలు అప్పగిస్తారనే మాటా వినిపిస్తోంది. ఏదేమైనా కూడా.. రాజమౌళి ఒకవేళ కట్టాకు అలాంటి ఛాన్సిస్తే మాత్రం.. ఇప్పటికే డౌన్ గ్రాఫ్‌ లో వెళుతున్న ఈ దర్శకుడి కెరియర్ కు ఇది పెద్ద సాయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English