కరవు తీర్చేసిన బ్లాక్‌బస్టర్

కరవు తీర్చేసిన బ్లాక్‌బస్టర్

‘సావరియా’ లాంటి ఫ్లాప్ సినిమాతో హీరోగా పరిచయం అయినప్పటికీ ఆ సినిమా తెచ్చిన పేరుతో అవకాశాలు బాగానే దక్కించుకున్నాడు రణబీర్ సింగ్. ఆ తర్వాత ‘బర్ఫీ’, ‘యే జవాని హై దివానీ’ లాంటి సినిమాలు అతడికి తిరుగులేని విజయాలందించాయి. ముఖ్యంగా ‘యే జవాని..’ అప్పట్లోనే రూ.200 కోట్లకు చేరువగా వసూళ్లు రాబట్టి రణబీర్‌ను పెద్ద స్టార్‌ని చేసింది.

ఖాన్ త్రయానికి పోటీ ఇచ్చే హీరో అంటూ అతడిని బాలీవుడ్ జనాలు ఆకాశానికెత్తేశారు. కానీ ఆ తర్వాత రణబీర్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. చివరగా అతను హీరోగా నటించిన ‘జగ్గా జసూస్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఇక అతను కోలుకోవడం కష్టమే అనేశారు ట్రేడ్ పండిట్లు.

ఐతే గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో రణబీర్ చేసిన ‘సంజు’ అతడి రాతను మార్చేసింది. సంజయ్ దత్ పాత్రలో జీవించేసిన రణబీర్‌పై ఎటు చూసినా ప్రశంసలే. ఈ సినిమా బాగున్నప్పటికీ దత్ జీవితాన్ని అతడికి నచ్చినట్లు తీశాడంటూ హిరానిపై విమర్శలు వస్తున్నా.. రణబీర్ విషయంలో మాత్రం ఏ విమర్శలూ లేవు. సంజయ్ పాత్రలో జీవించేశాడంటూ అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు.

బాలీవుడ్ గ్రేట్ ఆర్టిస్టుల్లో అతనొడకని కీర్తిస్తున్నారు. ఇక ఈ సినిమాతో రణబీర్‌కు దక్కిన విజయం అలాంటిలాంటిది కాదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లకు చేరువగా ఉంది. ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కును కూడా దాటేసేలా ఉంది. ఇది అన్ని రకాలుగా రణబీర్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా కాబోతోంది. మొత్తానికి ‘సంజు’తో రణబీర్ కరవు తీరిపోయే విజయమే దక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు