యాక్షన్ హీరో.. కంప్లీట్ లవ్ స్టోరీ

 యాక్షన్ హీరో.. కంప్లీట్ లవ్ స్టోరీ

కొంచెం ఇమేజ్ ఉన్న ప్రతి హీరో పేరు ముందూ ఏదో ఒక బిరుదు వచ్చేస్తుంది. గోపీచంద్‌ విషయానికొస్తే యాక్షన్ హీరో అనే ట్యాగ్ ఎప్పుడో తగిలించేశారు. అతడి సినిమాలు యాక్షన్ ప్రధానంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొంచెం ప్రయోగాత్మకంగా ఉండే కథలు ఎంచుకున్నా.. వాటిలోనూ యాక్షన్‌కే పెద్ద పీట వేస్తాడతను. అతడి ఆహార్యానికి, ఇమేజ్‌కు ప్రేమకథలు అస్సలు సూటవ్వవు.

హీరోగా తొలి సినిమా ‘తొలివలపు’లో లవ్ స్టోరీ ట్రై చేశాడు కానీ.. అది దారుణమైన ఫలితాన్నందించింది. ‘యజ్ఞం’ మంచి ఫలితాన్నివ్వవడంతో అక్కడి నుంచి యాక్షన్ బాటలోనే సాగుతున్నాడు. గురువారం రిలీజవుతున్న ‘పంతం’ కూడా యాక్షన్ ప్రధానంగానే సాగేలా కనిపిస్తోంది. ఐతే దీని తర్వాత మాత్రం అతను పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేస్తున్నాడట.

కుమార్ అనే కొత్త దర్శకుడు గోపీకి మంచి ప్రేమకథ చెప్పాడట. తనకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అవుతుందని అంటున్నాడు గోపీ. ఇంతకుముందు ‘జిల్’లో లవ్ స్టోరీ ఉన్నప్పటికీ అది కొంత వరకే అని.. కానీ కుమార్ దర్శకత్వంలో చేయబోయేది కంప్లీట్ లవ్ స్టోరీ అని.. తనకు ఇది చాలా కొత్తగా ఉందని చెప్పాడు గోపీ. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుందని చెప్పాడు. మరోవైపు ‘గౌతమ్ నంద’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలోనూ తాను ఓ సినిమా చేసే అవకాశాలున్నట్లు గోపీచంద్ తెలిపాడు.

ప్రస్తుతం కథ రెడీ అవుతోందన్నాడు. తనకు కూడా కొత్త తరహా సినిమాలు చేయాలని ఉంటుందని.. కానీ అన్ని కథలూ తనకు సూటవ్వవని గోపీ చెప్పాడు. తాను చాలా కథలే వింటున్నానని.. అందులో తనకు నప్పేవి ఎంచుకుని ముందుకు సాగుతున్నానని అన్నాడు గోపీ. తన కొత్త సినిమా ‘పంతం’పై ధీమా వ్యక్తం చేశాడతను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English