తెనాలి అమ్మాయే కానీ యమ ఘాటు

తెనాలి అమ్మాయే కానీ యమ ఘాటు

తెలుగు అమ్మాయిలు హాట్‌గా వుండరా అని ఈమధ్య పలువురు ప్రశ్నిస్తున్నారు. ముంబయి నుంచి వచ్చే భామలకి ధీటుగా అయితే తెలుగమ్మాయిలు నిలబడలేరని చాలా సార్లు రుజువైంది. ముఖ్యంగా వారి మాదిరిగా బికినీ రెడీ బాడీలు మన వాళ్లకి కష్టమే. అలాగే బికినీల్లో ధారాళంగా స్కిన్‌ షో చేయడానికి కూడా తెలుగమ్మాయిలు వెనకాడతారు.

కానీ మిస్‌ ఇండియా ఎర్త్‌ కిరీటాన్ని గెలుచుకున్న శోభితా ధూళిపాళ కేవలం ముంబయి భామలకే కాదు ఇంటర్నేషనల్‌ మోడల్స్‌ని కూడా సవాల్‌ చేసేలా అందాల ఆరబోత చేయగలదు. తెలుగమ్మాయే అయినా ఈమెని గుర్తించి అవకాశమివ్వడానికి మాత్రం టాలీవుడ్‌కి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు అడివి శేష్‌ చిత్రం గూడచారితో ఈమె తెలుగు తెరపై కనిపించబోతోంది. హిందీలో రమన్‌ రాఘవ్‌ అనే థ్రిల్లర్‌లో నటించిన శోభితకి ఇంకా బ్రేక్‌ రాలేదు.

అయినా ఇన్‌స్టాగ్రామ్‌లోను, మ్యాగజైన్‌ ఫోటో షూట్స్‌లోను తన టాలెంట్‌ చూపిస్తూనే వున్న తనకి తెలుగు తెరపై వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకుండా మొదటి సినిమాలోనే లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. మరి గూఢచారి రిలీజ్‌ అయిన తర్వాత శోభిత ఏ రేంజ్‌లో సంచలనం అవుతుందో, ఎన్ని సినిమాలు దక్కించుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు