దమ్ముంటే ఎదురు రండి.. దిల్‌ రాజు సవాల్‌!

దమ్ముంటే ఎదురు రండి.. దిల్‌ రాజు సవాల్‌!

'శ్రీనివాస కళ్యాణం' సినిమాపై దిల్‌ రాజు యమ కాన్ఫిడెంట్‌గా వున్నాడు. శతమానం భవతి తర్వాత తన బ్యానర్‌ నుంచి వస్తోన్న సినిమాపై ఇంత గన్‌షాట్‌గా దిల్‌ రాజు మాట్లాడ్డం ఇదేనంటున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నాడు. దసరాకి ముందు ఇదే బెస్ట్‌ డేట్‌ అనేది ట్రేడ్‌ మాట. గత యేడాది ఇలాంటి డేట్‌ వచ్చినపుడు మూడు సినిమాలు పోటీ పడ్డాయి.

'నేనే రాజు నేనే మంత్రి', 'జయ జానకీ నాయక', 'లై' చిత్రాల మధ్య జరిగిన పోటీలో మొదటి దానికే విజయం దక్కింది. ఈసారి కూడా ఆగస్టు 9 డేట్‌ ఆకర్షణీయంగా వుందని పలువురు నిర్మాతలు దానిపై కన్నేస్తున్నారు. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ 'శ్రీనివాస కళ్యాణం' ముహూర్తం మారదని దిల్‌ రాజు ముందే డేట్‌ అనౌన్స్‌ చేసేసాడు.

తనకి తెలిసిన వారితో కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఇది బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అని చెబుతున్నాడట. ఎవరు పోటీ వచ్చినా ఫర్వాలేదని దిల్‌ రాజు వ్యక్తం చేస్తోన్న కాన్ఫిడెన్స్‌ చూసి కొన్ని సినిమాలని వాయిదా వేసుకున్నారని కూడా అంటున్నారు. బొమ్మరిల్లు డేట్‌ అని, తన బ్యానర్‌లో ఇంకో బొమ్మరిల్లు రేంజ్‌ సినిమా ఇదని దిల్‌ రాజు వ్యక్తం చేస్తోన్న కాన్ఫిడెన్స్‌కి తగ్గట్టు ఇది హిట్టయితే మాత్రం నితిన్‌ పంట పండినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు