ఆ సినిమా విజయ్‌ దేవరకొండ ఆపేసాడా?

ఆ సినిమా విజయ్‌ దేవరకొండ ఆపేసాడా?

మే నెలలోనే విడుదలకి సిద్ధమని చెప్పిన 'టాక్సీవాలా' చిత్రాన్ని తర్వాత పలుమార్లు వాయిదా వేసారు. బిజినెస్‌ జరగకో లేక విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ తగ్గిపోవడమో కారణాలు కాదు. విడుదల తేదీ ప్రకటించి, ప్రమోషన్స్‌ కూడా చేసిన తర్వాత టాక్సీవాలాని ఎందుకు ఆపేసారు. దీనికి విజయ్‌ దేవరకొండ కారణమనే టాక్‌ వినిపిస్తోంది. అర్జున్‌ రెడ్డి తర్వాత దానిని క్యాష్‌ చేసుకునే సినిమా ఇంతవరకు విజయ్‌కి రాలేదు.

ఎప్పుడో ఆగిపోయిన 'ఏ మంత్రం వేసావె' విడుదలయి డిజాస్టర్‌ అయింది. మహానటి చిత్రంలో కేవలం సహాయ పాత్రలో మాత్రమే కనిపించాడు. ఈ టైమ్‌లో ఏదైనా తేడా రిజల్ట్‌ వస్తే అతని కెరియర్‌ ఎఫెక్ట్‌ అవుతుంది. టాక్సీవాలా ప్రయోగాత్మక చిత్రం కనుక ఆ ఛాన్స్‌ తీసుకోవడం రిస్క్‌ అని వాయిదా వేయమన్నాడట.

గీత గోవిందం చిత్రం రిలీజ్‌ అయితే, అది ఫుల్‌ కమర్షియల్‌ వేల్యూ వున్న సినిమా కనుక టాక్సీవాలాకి ప్లస్‌ అవుతుందని చెప్పాడట. ఇది ఒక వెర్షన్‌ అయితే టాక్సీవాలా మేకర్స్‌కి 'గీత గోవిందం' ప్రొడ్యూసర్‌ కూడా ఇదే చెప్పాడట. గీత గోవిందంతో మళ్లీ విజయ్‌ యూత్‌లో సెన్సేషన్‌ అయ్యాక టాక్సీవాలా రిలీజ్‌ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్‌ వుంటుందని. సో... గీత గోవిందం రిలీజ్‌ అయిన తర్వాతే టాక్సీవాలాని విడుదల చేద్దామని ఫిక్స్‌ అయ్యారట. ఆగస్టు 15న వచ్చే గీత గోవిందం పబ్లిసిటీపై విజయ్‌ దేవరకొండ ఆల్రెడీ దృష్టి పెట్టేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు