డౌట్స్‌ పక్కన పెట్టేసిన బన్నీ

డౌట్స్‌ పక్కన పెట్టేసిన బన్నీ

'నా పేరు సూర్య' ఊహించని షాక్‌ ఇవ్వడంతో అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రంపై కాస్త ఆలోచనలో పడ్డాడు. అంతకుముందే ఓకే చేసిన విక్రమ్‌ కుమార్‌ సబ్జెక్ట్‌కే మరిన్ని మెరుగులు దిద్దమని చెప్పాడు. అతను పలుమార్లు పలు వెర్షన్లు వినిపించినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చిన అల్లు అర్జున్‌ ఈలోగా వేరే దర్శకులతో పని చేయడానికి కూడా ప్రయత్నించాడని గుసగుసలు వినిపించాయి.

అయితే ఎట్టకేలకు విక్రమ్‌ కుమార్‌ సామర్ధ్యంపై బన్నీ డౌట్లు పక్కన పెట్టేసాడు. మనం చిత్రంతో ఘన విజయం సాధించిన విక్రమ్‌కుమార్‌ ఆ తర్వాత మరో హిట్‌ సినిమా ఇవ్వలేకపోయాడు. 24, హలో ప్రశంసలకే పరిమితమయ్యాయి. దీంతో విక్రమ్‌ కుమార్‌కి కమర్షియల్‌ అప్పీల్‌ వున్న సినిమా తీయడం రాదనే అభిప్రాయం బలపడిపోయింది.

అల్లు అర్జున్‌ కూడా ఇదే మీమాంసలో ఈ చిత్రం చేయాలా వద్దా అని తచ్చాడాడు. అయితే ఈలోగా అతనికి ఎక్సయిటింగ్‌ స్క్రిప్ట్‌ ఏదీ దొరక్కపోవడం, విక్రమ్‌ కుమార్‌కి ఏ సెంటర్స్‌, ఓవర్సీస్‌లో సాలిడ్‌ మార్కెట్‌ వుండడంతో తన డౌట్లు పక్కన పెట్టేసి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. విక్రమ్‌తో సినిమా అంటే రొటీన్‌ అయిపోతున్నాడనే పేరు తెచ్చుకుంటోన్న అల్లు అర్జున్‌కి మొత్తానికి ఒక కొత్త రకం సబ్జెక్ట్‌ దొరికిందని ఫిక్స్‌ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు