ప్చ్‌... క్రేజు రావట్లేదు తేజూ!

ప్చ్‌... క్రేజు రావట్లేదు తేజూ!

'తేజ్‌ ఐ లవ్యూ' చిత్రానికి ఫుల్‌గా క్రేజ్‌ తీసుకురావాలని పబ్లిసిటీ ఎప్పుడో స్టార్ట్‌ చేసేసారు. అయితే ఎప్పుడో కాలం చెల్లిపోయిన టెక్నిక్కులతోనే పబ్లిసిటీ చేస్తూ పోవడం వల్ల ఈ చిత్రానికి ప్రత్యేకమైన క్రేజేమీ రాలేదు. మరో రెండు రోజుల్లో రిలీజ్‌ వున్నా కానీ ఇంతవరకు ఈ చిత్రం తప్పక చూడాలనే ఫీలింగ్‌ అయితే తీసుకురాలేకపోయారు.

పబ్లిసిటీ పరంగా కొత్త కొత్త టెక్నిక్కులు ఫాలో అవుతూ సినిమాలని వైరల్‌ చేసేస్తోన్న ఈ ట్రెండ్‌లో తేజ్‌ యూనిట్‌ ఆ నాడి పట్టలేకపోయారు. అసలే సాయిధరమ్‌తేజ్‌కి ఇటీవల హిట్టే లేకపోవడం కూడా ఈ చిత్రానికి మైనస్‌ అయింది. అతను చేసిన నక్షత్రం, ఇంటిలిజెంట్‌ లాంటి చిత్రాలు ప్రేక్షకులని భయభ్రాంతులకి గురి చేయడంతో 'తేజ్‌' టాక్‌ తెలిసాక కానీ చూడరాదని డిసైడైనట్టున్నారు. ఆడియో కూడా హిట్‌ కాకపోవడంతో, కరుణాకరన్‌కి ఇప్పటి ప్రేక్షకులతో అంత టచ్‌ లేకపోవడంతో 'తేజ్‌ ఐ లవ్యూ' క్రేజ్‌ పరంగా ఎలాంటి ఫార్వర్డ్‌ స్టెప్‌ వేయలేకపోయింది.

ఆఖరి అస్త్రంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ప్రమోట్‌ చేయడానికి తేజు, అనుపమ కలిసి వెళుతున్నారట. ఆ ఎపిసోడ్‌ గురువారం ప్రసారమవుతుందట. ఇక తేజ్‌తో పాటే విడుదలవుతోన్న పంతం చిత్రానికి కూడా ఎలాంటి బజ్‌ లేదు. గోపీచంద్‌కి హిట్లు లేకపోవడానికి తోడు ఈ చిత్రం ప్రమోషన్స్‌ కూడా వీక్‌గా వుండడంతో పంతం గురించి కూడా అంత ఆసక్తి కనిపించడం లేదు. రేపు రిలీజ్‌ వున్నా కానీ అడ్వాన్స్‌ బుకింగ్‌ పరంగా అసలు సందడే వున్నట్టు లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English