కీర్తి కి సిగ్గు ఎక్కువట

కీర్తి కి సిగ్గు ఎక్కువట

టాలీవుడ్‌లో సంచ‌ల‌న న‌టిగా మారారు కీర్తి సురేశ్‌. ఇప్పుడు అంద‌రి నోటా నానున్న ఆమె కెరీర్ మొత్తాన్నిమ‌హాన‌టి ఒక్క‌సారిగా మార్చేసింద‌ని చెప్పాలి. మ‌హాన‌టి ముందు ఆమెకున్న ఇమేజ్ కు.. త‌ర్వాత ఆమె ఇమేజ్ కు పొంత‌నే లేదు. మ‌హాన‌టి త‌ర్వాత ఆమెకు ఛాన్సులు త‌గ్గిన‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండించింది కీర్తి సురేశ్‌.

త‌న చేతి నిండా ఆఫ‌ర్లేన‌ని.. మ‌హాన‌టికి ముందు ఒప్పుకున్న త‌మిళ మూవీస్ చేయ‌టానికే స‌మ‌యం స‌రిపోతుంద‌ని.. అందుకే తెలుగు మూవీస్ ను తానింకా ఓకే చేయ‌లేద‌ని చెబుతున్నారు. తాజాగా తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సావిత్రిగా న‌టించేందుకు కీర్తి సురేశ్‌ను ఓకే చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ్లామ‌ర్ చిత్రాల్లో నటించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క కిస్సింగ్ సీన్ కూడా చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చిన కీర్తిసురేశ్‌.. త‌న‌కు ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌టంలో ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని పేర్కొంది. వాస్త‌వానికి త‌న‌కు సిగ్గు ఎక్కువ‌ని.. ముద్దుసీన్లుచేసే విష‌యంలో త‌న‌కు ఇబ్బంది అని.. అదృష్ట‌వ‌శాత్తు త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ముద్దు సీన్లు చేయాల‌ని ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని చెప్పింది.

క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ చేస్తూ.. గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ కూడా.. ముద్దు సీన్లు చేసే ప‌రిస్థితి రాక‌పోవ‌టం అదృష్టం కాక మ‌రేంటి?  ఏంటో.. కీర్తిసురేశ్ అన్ని విష‌యాల్లోనే ల‌క్కీనే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు