తేజు కండలు చూసి అరవింద్ షాక్

తేజు కండలు చూసి అరవింద్ షాక్

గత ఏడాది కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన ‘నక్షత్రం’ కోసం బాగా కండలు పెంచి బలంగా తయారయ్యాడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా కోసం లావైన అతను.. ఆ తర్వాతి సినిమాల్లో సైతం కొంచెం బొద్దుగానే కనిపిస్తున్నాడు. చివరగా అతను చేసిన ‘ఇంటిలిజెంట్’లోనూ కొంచెం భారీగానే కనిపించాడు. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాలోనూ రూపం ఏమీ పెద్దగా మారినట్లు లేదు.

అందులోనూ గత కొన్ని రోజులుగా తేజులో మరింత మార్పు కనిపిస్తోంది. కొంచెం బరువు పెరిగాడు. అదే సమయంలో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు. ఈ విషయం మెగా ఫ్యామిలీ పెద్ద అల్లు అరవింద్‌కు కూడా అర్థమైంది. ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తేజును పట్టుకుని అతడి గురించి మాట్లాడుతున్న సందర్భంలో అతడి కండల గురించి ప్రస్తావించాడు అరవింద్.

‘ఏంట్రా ఈ కండలు.. ఏం తింటున్నావ్.. ఏం చేస్తున్నావ్’ అని అరవింద్ తేజును ప్రశ్నించాడు. దానికతను బదులిస్తూ ఈ మధ్య కొంచెం లావయ్యాను అన్నాడు. ఇక అరవింద్ తేజు గురించి మాట్లాడుతూ.. అతడి అరంగేట్ర చిత్రం వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మొదలైనప్పటికీ, తొలి సినిమాగా తాను నిర్మించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలైందని, అది మంచి విజయం సాధించి తేజుకు తొలి విజయాన్నందించిందని.. ఇది తనకెంతో ఆనందాన్నిచ్చే విషయమని చెప్పాడు.

ఆ సినిమాతో హిట్టు కొట్టి తన తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని తేజు ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని చెప్పాడు. తేజు మంచి ఆర్టిస్టే కాక మంచి వ్యక్తి కూడా అని.. అతను కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉంటాడని జోస్యం చెప్పాడు అరవింద్. ఈ మధ్య తేజు సినిమాలు కొన్ని అటు ఇటు అయ్యాయని.. ఐతే ఆ సినిమాలు ఆడవని తెలిసి కూడా మాట ఇచ్చామన్న ఒకే కారణంతో కెరీర్‌ను పణంగా పెట్టి సినిమాలు చేశాడని అరవింద్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English