రెండు వారాల్లో ఆ హీరో సినిమాలు రెండా?

రెండు వారాల్లో ఆ హీరో సినిమాలు రెండా?

ఒకే రోజు ఒక హీరో సినిమాలు రెండు రిలీజవడం చూశాం. కానీ గ్యాప్ లేకుండా సినిమాుల రిలీజ్ చేస్తే ఫలితాలు తేడా వచ్చేస్తుంటాయి. అందుకే ఏ హీరో అయినా ఒక సిినిమాకు మరో సినిమాకు కొన్ని నెలలైనా గ్యాప్ ఉండేలా చూసుకుంటాడు. కానీ కొన్నిసార్లు తక్కువ వ్యవధిలో ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. నాగచైతన్య విషయంలో ఇప్పుడిదే ఇబ్బంది తలెత్తినట్లు సమాచారం. అతడి కొత్త సినిమాలు ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’లను రెండు వారాల వ్యవధిలో రిలీజ్ చేసే ప్రయత్నాలు ఉన్నారట వాటి నిర్మాతలు.

నిజానికి ‘సవ్యసాచి’ జూన్ నెలలోనే విడుదల కావాల్సింది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ను జులై లేదా ఆగస్టుకు అనుకున్నారు. కానీ ‘సవ్యసాచి’ అనుకోకుండా ఆలస్యమైంది. జూన్ నుంచి జులైకి.. జులై నుంచి ఆగస్టుకు వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రాన్ని ఆగస్టు 17న విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం నుంచే ఈ మేరకు లీకులు వచ్చాయి.

మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ టీం తమ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. ఇలా ఎవరికి వాళ్లు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ రెండు వారాల వ్యవధిలో ఒక పేరున్న హీరో సినిమాలు రిలీజవడం మంచి విషయం కాదు. ఇది రెండు సినిమాలకూ ఇబ్బందే. ఐతే సెప్టెంబరు 12న నాగార్జన మల్టీస్టారర్ మూవీ రాబోతున్న నేపథ్యంలో ముందు వెనుక రెండు వారాలు వదిలేయాలి. చైతూకు ఇది ఇబ్బంది కరమే. అలాంటపుడు ఆగస్టులోనే డేట్లు సర్దుబాటు చేసుకుని రెండు సినిమాల్ని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అతను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.