అమీర్ వదిలేసిన సినిమాలో అతనే..

అమీర్ వదిలేసిన సినిమాలో అతనే..

చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాలో అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తాడని గత ఏడాది వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ‘మహాభారతం’ మీద తీయబోయే సినిమా కోసమో మరో కారణంతోనో అమీర్ ఖాన్ ఈ సినిమా నుంచి కొన్ని నెలల కిందటే తప్పుకున్నాడు. అమీర్ స్థానంలోకి షారుఖ్ వచ్చాడని.. అతనే ఈ సినిమాలో హీరో అని అన్నారు. కానీ తర్వాత అప్ డేట్ లేదు. ఐతే ఎట్టకేలకు ఈ విషయం ఖరారైంది.

ఈ చిత్రాన్ని నిర్మించనున్న  యూటీవీ పిక్చర్స్ అధినేత సిద్దార్థ్ రాయ్ కపూర్.. ఇందులో షారుఖే హీరో అని ధ్రువీకరించాడు. ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అక్టోబర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. 2019 చివర్లో విడుదల అని కూడా ప్రకటించారు.  భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్ లాంటి గొప్ప సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మహేష్ మథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది యూటీవీ పిక్చర్స్. వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారట.కొన్నేళ్ల పాటు వరుసగా మసాలా సినిమాలు చేసి గట్టి ఎదురు దెబ్బలు తిని, బాగా మార్కెట్ కోల్పోయిన షారుఖ్.. ఈ మధ్య మార్పు చూపించే ప్రయత్నంలో పడ్డాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో అతను మరగుజ్జుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత రాకేశ్ శర్మ బయోపిక్ అతడికి మరో వైవిధ్యమైన సినిమా కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు