ఎన్టీఆర్‌కి పోటీగా ఇద్దరు హీరోలు

ఎన్టీఆర్‌కి పోటీగా ఇద్దరు హీరోలు

ఈ యేడాదిలో టాప్‌ సూపర్‌స్టార్ల సినిమాల్లో 'అరవింద సమేత' తప్ప ఏదీ పెండింగ్‌లో లేదు. వచ్చే ఆరు నెలల్లో ఎన్టీఆర్‌ సినిమా ఒక్కటే పెద్ద సినిమా కావడంతో వసూళ్లు అదిరిపోతాయని అభిమానులు ఇప్పట్నుంచే సంబరపడుతున్నారు. దసరా బరిలో నిలబడనున్న తారక్‌-త్రివిక్రమ్‌ల 'అరవింద సమేత వీర రాఘవ'కి ఫ్రీ గ్రౌండ్‌ అయితే దొరకదట. దసరా పెద్ద సీజన్‌ కనుక మరి కొన్ని క్రేజీ చిత్రాలు కూడా ఆ టైమ్‌లో విడుదల కాబోతున్నాయి.

నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కూడా దసరాకే విడుదలవుతుందట. ఈ చిత్రం టాకీ పార్టు చాలా వరకు పూర్తయిందట. ఇందులో నాగార్జున మాఫియా డాన్‌గా నటిస్తున్నాడు. యాక్షన్‌ ప్లస్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రానికి కథ హైలైట్‌ అని చెబుతున్నారు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య చెప్పిన లైన్‌కి ఫిదా అయి నాగార్జున, నాని మిగతా సినిమాలన్నీ వాయిదా వేసి మరీ ముందుగా ఇది పూర్తి చేస్తున్నారు. మరి ఈ చిత్రం 'అరవింద సమేత'కి ముందు రిలీజ్‌ అవుతుందో, తర్వాత రిలీజ్‌ అవుతుందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఎఫెక్ట్‌ అయితే వుంటుంది.

ఇది మాత్రమే కాకుండా మరికొన్ని మీడియం బడ్జెట్‌ చిత్రాలు కూడా దసరానే టార్గెట్‌ చేస్తున్నాయి. అరవింద సమేత విడుదలకి దగ్గర పడిన తర్వాత అంచనాలు పెంచేలా ప్రోమోలు అవీ కనిపిస్తే మిగతా వాళ్లు వెనక్కి తగ్గవచ్చునేమో కానీ లేదంటే త్రివిక్రమ్‌ గత చిత్రం అజ్ఞాతవాసి ఫలితం చూసి దీనిని పెద్ద త్రెట్‌గా భావించకపోయినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు