నాని బలహీనతలు బయటపడుతున్నాయ్‌

నాని బలహీనతలు బయటపడుతున్నాయ్‌

నాని సూపర్‌స్టార్‌ కాకపోవచ్చు కానీ బిగ్‌బాస్‌ హోస్ట్‌ అయ్యాడు కనుక సూపర్‌స్టార్‌లానే ఫీలవ్వాలి. ఈ షోపై ఇంతవరకు నానికి పూర్తి కమాండ్‌ రాలేదు. ఒక వారం బాగా చేసాడనిపిస్తే, ఆ తర్వాత మళ్లీ నీరసంగా కానిచ్చేస్తున్నాడు. ఎనర్జీ లెవల్స్‌ మెయింటైన్‌ చేయలేకపోతున్నాడు, అలాగే కంటెస్టెంట్స్‌కి తనంటే భయం కలిగించలేకపోతున్నాడు. చాలా మంది హౌస్‌మేట్స్‌ అతడిని ఏకవచనంలోనే సంబోధించడం ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తోంది.

కాస్త కటవుగా వ్యవహరిస్తే వాళ్లంతా దార్లోకి వచ్చేసేవారే. కానీ నానికే ముందు ఆ కాన్ఫిడెన్స్‌ లేకుండా పోయింది. హౌస్‌లో వున్న ఎవరికంటే కూడా నాని తక్కువేం కాదు. టాప్‌ స్టార్లని మినహాయిస్తే తదుపరి స్థాయి హీరోల్లో నానినే నంబర్‌వన్‌. కానీ ఆ స్టార్‌డమ్‌ నాని క్యారీ చేయలేకపోతున్నాడు. ఏమంటే తిరిగి ఏమంటారో అన్నట్టుగా ఆచి తూచి మాట్లాడుతున్నాడు. హీరోగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే నాని ఇలాంటి కార్యక్రమాలని హోస్ట్‌ చేయలేడని మాత్రం ఒక్కో వారం గడిచేకొద్దీ ఫీలింగ్‌ బలపడిపోతోంది. ఇప్పటికే నానిని హోస్ట్‌గా మార్చేయమని కూడా పలువురు స్టార్‌ మా నెట్‌వర్క్‌ని రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

ఎవరైనా స్టార్‌ లేదా కమాండింగ్‌ పర్సనాలిటీ ఆ పొజిషన్‌లో వుండాలని లేదంటే ఈ షో మరింత తేలిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసినపుడు వారం అంతా ఎలా వున్నా అతను వచ్చిన వీకెండ్స్‌లో మాత్రం షో బ్రహ్మాండంగా వుండేది. తారక్‌ రేంజ్‌కి తగ్గట్టు వుండాలని రైటర్స్‌ కూడా ఒళ్ళు దగ్గరపెట్టుకునేవారు. నాని అనేసరికి వాళ్ళు కూడా లైట్‌ తీసుకుంటున్నట్టున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు