తేజ కోసం కాజల్ మరో త్యాగం

తేజ కోసం కాజల్ మరో త్యాగం

సినీ రంగంలో కృతజ్నత చూపించే వాళ్లు చాలా తక్కువమంది ఉంటారంటారు. కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్నాక ఆరంభంలో తొలి అవకాశం ఇచ్చిన వాళ్లను గుర్తుంచుకునేవాళ్లు తక్కువ మందే. ఆ తక్కువ మందిలో కాజల్ అగర్వాల్ పేరు చెప్పుకోవాలి. తేజ సినిమా ‘లక్ష్మీకళ్యాణం’తో కథానాయికగా పరిచయమైన కాజల్.. ఆ తర్వాత చాలా పెద్ద రేంజికి వెళ్లినా తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన తేజను మరిచిపోలేదు. తాను పరిచయం చేసిన వాళ్లలో చాలామంది తనను గుర్తుంచుకోలేదని.. కానీ కాజల్ మాత్రం కృతజ్నతతో మెలిగిందని తేజ స్వయంగా ప్రకటించాడు.

తేజ వరుస వైఫల్యాల్లో ఉన్నపుడు ఆయన తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో నటించడానికి ఒప్పుకోవడంతో పాటు ఆ చిత్రానికి పారితోషకం కూడా తగ్గించుకుంది కాజల్. ఆమె మరోసారి తన గాడ్ ఫాదర్ కోసం త్యాగం చేయబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో జత కట్టడానికి అంగీకరించడమే కాక.. ఈ సినిమాకు కూడా పారితోషకంలో కొంచెం డిస్కౌంట్ ఇచ్చిందట. సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో తేజ కోసమే ఆమె ఈ మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నాక తేజ చేసే సినిమా అంటూ మూణ్నాలుగు ప్రాజెక్టులు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఆయన చివరికి బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. మరోవైపు డీవీవీ దానయ్య కొడుకు హీరోగా పరిచయం కానున్న సినిమాకు కూడా తేజనే దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు