‘బాహుబలి’ని కొట్టేసాడుగా

‘బాహుబలి’ని కొట్టేసాడుగా

అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తోడైనపుడే కాదు.. ఒక మామూలు హీరోతో జత కట్టినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలనని రుజువు చేస్తున్నాడు బాలీవుడ్ అగ్ర దర్శకుడు. అమీర్ ఖాన్‌తో ఇంతకుముందు ఆయన తీసిన ‘3 ఇడియట్స్’.. ‘పీకే’ ఏ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. ఐతే ఇప్పుడాయన రణబీర్ కపూర్ లాంటి ఫ్లాప్ హీరోతో ‘సంజు’ సినిమా చేసి బాక్సాఫీస్ రేసులో దిగాడు. ఈ చిత్రం కూడా ఆయన గత సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

ఈ సినిమా తొలి రోజే ఇండియాలో రూ.34.75 కోట్ల వసూళ్లతో ఈ ఏడాది డే-1 హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో కూడా ఆ సినిమా జోరు తగ్గలేదు. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగాయి. శనివారం రూ.38.60 కోట్లు కొల్లగొట్టిన ‘సంజు’.. ఆదివారం ఏకంగా రూ.46.71 కోట్లు రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.120 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. గత ఏడాది సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ జిందా హై’ కూడా మూడు రోజుల్లో రూ.114 కోట్లే వసూలు చేయడం గమనార్హం.

విశేషం ఏంటంటే ఆదివారం రూ.46.71 కోట్ల వసూళ్లతో ‘సంజు’ ఒక సంచలన రికార్డును బద్దలు కొట్టింది. ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ గత ఏడాది నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టేసింది. రాజమౌళి సినిమా రూ.46.5 కోట్లు వసూలు చేసింది. ఏకంగా ‘బాహుబలి’ రికార్డునే బద్దలు కొట్టడమంటే మామూలు విషయం కాదు. మరి ఈ చిత్రం ఫుల్ రన్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English