ఆ హీరో కూడా బయోపిక్‌ కావాలంటున్నాడట

ఆ హీరో కూడా బయోపిక్‌ కావాలంటున్నాడట

సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'సంజు' మొదటి వారాంతంలో రికార్డు వసూళ్లు నమోదు చేసింది. టాడా చట్టం కింద అరెస్ట్‌ అయి, అక్రమ ఆయుధాల కేసులో కొన్నేళ్ల పాటు జైలు జీవనం గడిపిన సంజయ్‌ దత్‌ జీవితంలో చాలా తప్పులు చేసాడు. డ్రగ్స్‌కి బానిస అయి, స్త్రీ లోలుడిగా మారి ఎన్నో పొరపాట్లు చేసిన సంజయ్‌దత్‌ అసలు తాను ఎందుకు అన్ని తప్పులు చేయాల్సి వచ్చిందో చెప్పడానికా అన్నట్టు ఈ బయోపిక్‌ తీయించుకున్నాడు. దర్శకుడిగా హిరానీకి తొలి అవకాశం ఇచ్చిన సంజయ్‌దత్‌ ఆ చనువుతో మున్నాభాయ్‌ దర్శకుడితోనే తన బయోపిక్‌ రూపొందించాడు.

వాస్తవాలని దాచేసి, సంజయ్‌దత్‌ని ఉత్తముడిగా చూపించే ప్రయత్నం బాగా జరిగిందని ఈ చిత్రం చూసిన వారిలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే సంజు కథ తెలియని వారు ఈ సినిమాలో చూపించింది నిజమేనని నమ్మి అతడి పట్ల సింపతీ చూపిస్తున్నారు. డార్క్‌ పాస్ట్‌ వున్న యాక్టర్లకి ఇప్పుడు బయోపిక్‌ తమకి నచ్చినట్టు తీయించుకోవడం ఒక ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. బయోగ్రఫీ రాయడం కంటే సినిమా తీస్తే ఎక్కువ మందికి చేరుతుందని భావిస్తున్నారు.

సంజయ్‌దత్‌లానే పలు నేరాలు చేసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇప్పుడు బయోపిక్‌ తీయించుకుందామని యోచిస్తున్నాడట. తన జీవితంలోను చాలా మసాలా వుందని, తనపై పెట్టిన కేసులకి కూడా తగిన వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని బయోపిక్‌ ఇస్తుందని భావిస్తున్నాడట. మంచి దర్శకుడు దొరికితే ఆ చిత్రానికి ఫండింగ్‌ ఇవ్వడానికి కూడా సల్మాన్‌ సిద్ధంగా వున్నాడట. రానున్న రోజుల్లో మరిన్ని బయోపిక్స్‌కి శ్రీకారం చుట్టడానికి సంజు హెల్ప్‌ అవుతుంది. బయోపిక్‌ అంటే ఉత్తముల గురించే తీయాలని గతంలో ఒక భావన వుండేది. నేరస్థుల గురించి కూడా సినిమాలు తీసి కోట్లు కొల్లగొట్టవచ్చునని ఇది నిరూపించిందిగా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English