పుట్టి మునిగింది శంకరా..!

పుట్టి మునిగింది శంకరా..!

సినిమా హిట్టయ్యే వరకు అయినా వేచి చూడకుండా షకలక శంకర్‌ ఆల్రెడీ స్టార్‌ అయిపోయానని అనుకున్నాడు. తన సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చెబుతూ, తనని హీరో చేయని వాళ్లంతా ఎంతెంత నష్టపోయారో కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. కమెడియన్‌గా తనకి తగ్గ పాత్రలు రావడం లేదని, అందుకే హీరోగా మారానని నింద తెలుగు చిత్ర పరిశ్రమపై వేసేసాడు.

కమెడియన్‌గా గుర్తుండిపోయే క్యారెక్టర్‌ ఒక్కటైనా చేయకుండానే హీరోగా మారి డాన్సులు, ఫైట్లు, పంచ్‌ డైలాగులు అంటూ రెచ్చిపోయిన షకలక శంకర్‌కి ఊహించిన ఫలితమే ఎదురయింది. 'శంభో శంకర' చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టగా, విమర్శకులు చీల్చి చెండాడారు. ఈ చిత్రం పరాజయం పాలవడంతో ఇప్పుడు షకలక శంకర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయింది. ఇక తనని హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాత దొరకడం కష్టమే. మరోవైపు కమెడియన్‌గా అవకాశం ఇవ్వడానికి ఎవరైనా ఆసక్తి చూపడం కూడా గగనమే. కమెడియన్‌గా సాఫీగా సాగిపోతున్న బండిని చేజేతులా ఇప్పుడు నట్టేట్లో పడేసుకున్నట్టయింది.

ఇప్పటికే విడుదలకి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ అన్నీ సినిమాకి హైప్‌ తీసుకురావడానికి ఇచ్చానని డ్యామేజ్‌ కంట్రోల్‌ స్టార్ట్‌ చేసాడు కానీ ఒక్కసారి అసలు రంగు బయట పడ్డాక ఇండస్ట్రీ ఎవరిని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచుతుందనేది తెలిసిందే. లౌక్యంతో అవకాశాలు పట్టాల్సిన వాడల్లా స్వయానా పుట్టి ముంచేసుకున్నాడు పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు